Adilabad | అందుబాటులో లేని డాక్టర్.. వైద్యం అందక గిరిజన బాలుడు మృతి

Adilabad విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన 3 సంవత్సరాల బాలుడికి తీవ్రంగా జ్వరం రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందక బాలుడు మృతి చెందాడు. బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన మూడు సంవత్సరాల బాలుడు పంద్ర పరశురాంకు బుధవారం జ్వరం రాగా ఆయన తండ్రి లక్ష్మణ్‌ ఆ బాలుడిని మండల కేంద్రానికి తీసుకొని వచ్చి ఒక […]

Adilabad | అందుబాటులో లేని డాక్టర్.. వైద్యం అందక గిరిజన బాలుడు మృతి

Adilabad

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన 3 సంవత్సరాల బాలుడికి తీవ్రంగా జ్వరం రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందక బాలుడు మృతి చెందాడు.

బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన మూడు సంవత్సరాల బాలుడు పంద్ర పరశురాంకు బుధవారం జ్వరం రాగా ఆయన తండ్రి లక్ష్మణ్‌ ఆ బాలుడిని మండల కేంద్రానికి తీసుకొని వచ్చి ఒక ఆర్ఎంపి డాక్టర్ వద్ద చికిత్స చేయించుకొని వెళ్లినట్లు సమాచారం.

గురువారం రోజు మళ్లీ ఆ బాలునికి కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో ఉదయమే బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కి బైక్ మీద బాబుని తీసుకొని వెళ్లారు. డెడ్రా నుంచి బుతాయి వరకు రోడ్డు సౌకర్యం సరిగా లేదు.

వర్షంతో బురద, గుంతలు పడిన రోడ్డులో ఎలాగోలా తిప్పలు పడి బాలుడిని ఆసుపత్రికి తీసుకుని వస్తే అక్కడ డాక్టర్ అందుబాటులో లేడు. క్రింది స్థాయి మెడికల్ సిబ్బంది ఉన్నప్పటికీ, వారికి సరియైన వైద్యం చేయలేక పోయారని బాలుని తండ్రీ ఆరోపణలు చేశారు. సరైన రోడ్డు సౌకర్యం లేక, ఇక్కడ వైద్యం అందక తన కుమారుడు మృతి చెందాడని తండ్రి బోరున విలపించాడు.

ప్రభుత్వం వర్షాకాలం సీజనల్ వ్యాధులు ఉన్న నేపథ్యంలో ప్రజలకు 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత డాక్టర్లు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అందుబాటులో లేకపోవడం మూలంగానే బాలుడు మృతి చెందాడని ఆరోపించారు. మండల కేంద్ర ఆసుపత్రిలో 4 గురు డాక్టర్లు ఉండాలి. 24×7 గంటలు పనిచేయాల్సిన ఈ దవాఖానాలో ఒక్కరు కూడా ఉండకుంటే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

డాక్టర్లు అందుబాటులో ఉంటే ఏదో ఒక సూచన చేసే వారని, కింది స్థాయి సిబ్బంది డాక్టర్ ఆదేశం లేనిది ఏమి నిర్ణయం తీసుకోలేరని, ఇలాంటి ఆసుపత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని, అధికారులు బజార్ హత్నూర్ ఆసుపత్రిలో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకో వాలని కోరారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని మండల ప్రజలు కోరారు.