Adilabad | ధాన్యం డబ్బులు అడిగితే దాడులా?: ప్రేమ్‌సాగర్‌రావు
Adilabad రైతుపై బీఆర్ఎస్ నాయకుని దాడి.. గాయపడిన రైతును కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ధాన్యం అమ్మినా పైసలు ఇంకా రాలేదని వాటిని ఇప్పించాలని కోరిన నేపథ్యంలో టిఆర్ఎస్ నాయకుడు దాడి చేశాడని, బీఆర్ఎస్ నాయకులకు అధికారమే ముఖ్యం కాని ప్రజా సమస్యల పరిష్కారం పై శ్రద్ధ లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ సాగర్ రావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు […]

Adilabad
- రైతుపై బీఆర్ఎస్ నాయకుని దాడి..
- గాయపడిన రైతును కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది..
- మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ధాన్యం అమ్మినా పైసలు ఇంకా రాలేదని వాటిని ఇప్పించాలని కోరిన నేపథ్యంలో టిఆర్ఎస్ నాయకుడు దాడి చేశాడని, బీఆర్ఎస్ నాయకులకు అధికారమే ముఖ్యం కాని ప్రజా సమస్యల పరిష్కారం పై శ్రద్ధ లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ సాగర్ రావు విమర్శించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆదివారం నాడు ఎమ్మెల్యే కొడుకు విజిత్ రావు దండేపల్లి మండలం కాసిపేట్ లో ప్రచారం చేస్తున్న క్రమంలో జంగిలి ముత్తయ్య అనే రైతు తనకు 47 ధాన్యం బస్తాలలో కోత విధించారని తెలుపగా అక్కడే ఉన్న బిఆర్ఎస్ వార్డ్ సభ్యుడు కోడి రాజేష్ రైతు ముత్తయ్య పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచడం ఆటవిక చర్య అని అన్నారు.
వార్డు సభ్యుడు దాడిలో రైతు గాయపడి ముక్కుల నుండి రక్తం కారుతున్నా కానీ ఎమ్మెల్యే తనయుడు అక్కడినుండి వెళ్లి పక్క ఇంట్లో ప్రచారం చేయడం పై మండి పడ్డారు. నన్ను గుండాగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే గ్రూప్ వారే ప్రత్యక్ష గుండాయిజానికి దిగడం ప్రజలు గమనిస్తున్నారన్నారని అన్నారు.
గాయపడ్డ రైతు కు కాంగ్రెస్ పార్టీ వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. జిల్లాలో ఇంకా చాలా మంది రైతులకు ధాన్యం డబ్బులు రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని, రాబోవు రోజుల్లో అధికారం లోకి వచ్చి రైతుల సమస్యలు తీరుస్తామన్నారు.
ఓ పక్క రైతు బంధు ఇస్తూ.. అంతకు మించి రైతుకు తరుగు పేరుతో నష్ట పెడుతున్నారన్నారు. రైతులకు ఇంతకు పూర్వం ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు చెల్లించకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని తెలిపారు. రైతులు పండించిన పంటలకు సరైన ధర , లాభాలు రావడం లేదన్నారు. తరుగు.. ఇతర కారణాల తో రైతులకు అన్యాయం జరుగుతోందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్ధులు తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారంకు తెర తీశారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రభుత్వంలో తనకు సముచితస్థానం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దయచేసి ఎవరు ప్రత్యర్థుల ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.