‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్.. ఆ హీరో లుక్‌తో పోలికలు
విధాత: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లుక్ విడుదలైనప్పటి నుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని రామ్ చరణ్ లుక్‌తో పోల్చుతూ.. నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ లుక్ కంటే కూడా ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు లుక్కే అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. వాస్తవానికి ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ కోసం.. ప్రభాస్ […]

విధాత: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లుక్ విడుదలైనప్పటి నుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని రామ్ చరణ్ లుక్‌తో పోల్చుతూ.. నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ లుక్ కంటే కూడా ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు లుక్కే అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
వాస్తవానికి ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ కోసం.. ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. సినిమా పూర్తై చాలా కాలం అవుతున్నా.. ఫస్ట్ లుక్ విషయంలో మేకర్స్ ఏ విషయాన్ని చెప్పకుండా ఫ్యాన్స్‌ని నిరాశకు గురి చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఫస్ట్ లుక్ వదిలితే.. అది వేరే హీరో ఆల్రెడీ చేసిన పాత్ర లుక్‌లా ఉండటంతో ఫ్యాన్స్ తీవ్రంగా డిజప్పాయింట్ అవుతున్నారు.

ఈ ఫస్ట్ లుక్‌లో బాణాన్ని ఆకాశం వైపు ఎక్కు పెట్టినట్టి ఉన్న ప్రభాస్ లుక్ పవర్‌ఫుల్‌గా ఉంది. సినిమా క్యాప్షన్‌లో రాసినట్లు చెడుపై మంచి విజయాన్ని సాధించేందుకు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఎలాంటి ధర్మ పోరాటం చేశారనేది సినిమాలో అద్భుతంగా తెరకెక్కించినట్లు ఈ లుక్‌తో తెలుస్తోంది.
ఈ లుక్ విడుదల అనంతరం దర్శకుడు ఓం రౌత్ ‘‘ఈ మ్యాజికల్ జర్నీలో మీరు కూడా భాగమయ్యేందుకు అక్టోబర్ 2న సాయంత్రం 7.11 నిమిషాలకు అయోధ్యకు వచ్చేయండి’’ అని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓంరౌత్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొననున్నారు.

ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. రామాయణ ఇతిహాస నేపథ్యంతో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కృతి సనన్ సీతగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐమాక్స్ ఫార్మట్‌తో పాటు త్రీడీలోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ ట్వీట్స్‌తోనూ, నెటిజన్ల పోలికలతోనూ.. ‘ఆదిపురుష్’ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
