రూ.45 చోరీ.. 24 ఏండ్ల తర్వాత తీర్పు.. 4 రోజులు శిక్ష
విధాత: చోరీ జరిగిన సంవత్సరం 1998.. తీర్పు వెల్లడైంది 2022లో.. మరి శిక్ష మాత్రం నాలుగు రోజులే. ఈ విచిత్రమైన కేసు ఉత్తరప్రదేశ్ మెయిన్‌పురిలోని చీఫ్ జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. 1998, ఏప్రిల్ 17వ తేదీన వీరేంద్ర అనే వ్యక్తి జేబులో నుంచి మన్నాన్ అనే వ్యక్తి రూ. 45 దొంగిలించాడు. దీంతో వీరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మన్నాన్‌ను అరెస్టు చేసి ఏప్రిల్ 18న రిమాండ్‌కు […]

విధాత: చోరీ జరిగిన సంవత్సరం 1998.. తీర్పు వెల్లడైంది 2022లో.. మరి శిక్ష మాత్రం నాలుగు రోజులే. ఈ విచిత్రమైన కేసు ఉత్తరప్రదేశ్ మెయిన్‌పురిలోని చీఫ్ జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. 1998, ఏప్రిల్ 17వ తేదీన వీరేంద్ర అనే వ్యక్తి జేబులో నుంచి మన్నాన్ అనే వ్యక్తి రూ. 45 దొంగిలించాడు. దీంతో వీరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మన్నాన్‌ను అరెస్టు చేసి ఏప్రిల్ 18న రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల 21 రోజులు జైలు శిక్ష అనుభవించాడు మన్నాన్.
ఆ తర్వాత బెయిల్‌పై అతను విడుదలయ్యాడు. ఈ కేసులో కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు వారెంట్లు జారీ చేసినప్పటికీ, అవి మన్నాన్‌కు అందలేదు. మన్నాన్ కూడా కోర్టుకు హాజరవడం లేదు. అయితే ఈ కేసు నుంచి బయట పడాలని భావించిన మన్నాన్ తన లాయర్ ద్వారా సెప్టెంబర్ 27న కోర్టును ఆశ్రయించాడు. తాను నేరం చేసినట్లు మన్నాన్ కోర్టు ముందు అంగీకరించారు. దీంతో సెప్టెంబర్ 28న కోర్టు తీర్పు వెల్లడించింది. మన్నాన్‌కు నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.