విడాకుల తర్వాత సమంత ఆస్తులు ఎంత?
విధాత: వెండితెరపై సమంత 12 ఏళ్లుగా ఏకచిత్రాధిపత్యం చేస్తోంది. మొదటి చిత్రం ‘ఏ మాయ చేసావే’ నుండి ‘యశోద’ వరకు ఆమె కెరీర్ నిరాటంకంగా సాగింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సమంత సోలోగా ఎదిగింది. టాలెంట్, అదృష్టం రెండు ఉండడంతో ఇక సమంతాను ఆపడం ఎవరి తరం కాలేదు. విడాకులు తీసుకునే నాటికి కూడా సమంత రెమ్యూనరేషన్, క్రేజ్ ఆమె భర్త నాగచైతన్య కంటే ఎక్కువే. ఈమె తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాలు చేసింది. […]

విధాత: వెండితెరపై సమంత 12 ఏళ్లుగా ఏకచిత్రాధిపత్యం చేస్తోంది. మొదటి చిత్రం ‘ఏ మాయ చేసావే’ నుండి ‘యశోద’ వరకు ఆమె కెరీర్ నిరాటంకంగా సాగింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సమంత సోలోగా ఎదిగింది. టాలెంట్, అదృష్టం రెండు ఉండడంతో ఇక సమంతాను ఆపడం ఎవరి తరం కాలేదు. విడాకులు తీసుకునే నాటికి కూడా సమంత రెమ్యూనరేషన్, క్రేజ్ ఆమె భర్త నాగచైతన్య కంటే ఎక్కువే.
ఈమె తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాలు చేసింది. టాప్ హీరోలతో నటించింది. సమంత లేటెస్ట్ మూవీ ‘యశోద’ కూడా మంచి హిట్ కొట్టింది. నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చింది. ఇంతకీ సమంతా ఆస్తులు విలువ ఎంత? ఇన్నేళ్ళ కెరీర్‌లో ఆమె ఎంత దాచి పెట్టారు? అనే ఆత్రుత చాలా మందిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం సమంత ఆస్తులు చిట్టా బాగానే ఉందని తెలుస్తుంది.
ఆమెకు హైదరాబాదులో లగ్జరీ అపార్ట్మెంట్స్ సముదాయంలో ఖరీదైన పెంట్ హౌస్ ఉంది. దీని ధర రెండు కోట్లు. అంతేకాక సమంత తన స్నేహితులతో కలిసి కొన్ని వ్యాపారాలు కూడా చేస్తుంది. సాకీ అనే ఫ్యాషన్ బ్రాండ్ ఆమె రన్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్స్ ద్వారా ఒక్కో ప్రమోషన్‌కి ఆమె సమంత 10 నుంచి 20 లక్షలు వసూలు చేస్తుంది. సినిమాకు సమంత నాలుగైదుకోట్లు తీసుకుంటుంది.
బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్‌తో రెండు మూడు లగ్జరీకార్లు ఉన్నాయి. ఇతర ఎండార్స్మెంట్లు ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఆదాయం వస్తుంది. ముంబై, చెన్నైలలో ఖరీదైన ఇల్లు ఉన్నాయి. షేర్స్‌లో కూడా ఆమెకు కొంత ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. మొత్తంగా సమంత ఆస్తులు విలువ 97 కోట్లు అని తెలుస్తుంది. అటు ఇటుగా చూసుకుంటే రూ. 100 కోట్లు అన్నమాట.
సమంత నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడు కూడా తన సంపాదన షేర్ చేయలేదు. చైతు ఆల్రెడీ ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు. తనకంటూ హీరోగా కోట్ల సంపాదన, ఆస్తులు ఉన్నాయి. దీంతో సమంత సంపదలను ఆయన టచ్ చేయలేదు. విడాకులు తర్వాత సమంత భరణం తీసుకున్నారు అన్నది నిజం కాదు.
ఆత్మవిశ్వాసం కలిగిన సమంత, నాగచైతన్య పై కోపంతో ఒక్క రూపాయి కూడా ఆశించలేదట. సమంతా, చైతు ఇష్టపడి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆ ఇంట్లోకి అడుగుపెట్టే లోపే విడిపోయారు. ఆ ఇంటిని నిర్మాణంలో కూడా సమంత వాటా ఉండే ఉంటుంది. ఇలా చూసుకుంటే ప్రస్తుతానికి సమంతకు ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేవని చెప్పాలి..!