Agniveer Recruitment | దేశ సేవే మీ లక్ష్యమా..? అగ్నివీరుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు  ఎలా చేసుకోవాలంటే..?జి

Agniveer Recruitment | నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం అగ్నిపథ్‌ స్కీమ్‌ కింద అగ్నివీర్ల నియామకానికి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గురువారం నుంచి (ఫిబ్రవరి 16) మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జోన్‌ల వారీగా నోటిఫికేషన్లను అధికారులు వేర్వేరుగా విడుదల చేశారు. రెండు దశల్లో చేపట్టే.. ఈ ఎంపిక ప్రక్రియలో తొలుత ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత […]

Agniveer Recruitment | దేశ సేవే మీ లక్ష్యమా..? అగ్నివీరుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు  ఎలా చేసుకోవాలంటే..?జి
Agniveer Recruitment | నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం అగ్నిపథ్‌ స్కీమ్‌ కింద అగ్నివీర్ల నియామకానికి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గురువారం నుంచి (ఫిబ్రవరి 16) మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జోన్‌ల వారీగా నోటిఫికేషన్లను అధికారులు వేర్వేరుగా విడుదల చేశారు. రెండు దశల్లో చేపట్టే.. ఈ ఎంపిక ప్రక్రియలో తొలుత ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ర్రికూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్‌ 17నుంచి అగ్నివీర్‌ ప్రైమరీ అర్హత పరీక్ష జరగనుంది. అగ్నివీరులుగా చేరేందుకు joinindianarmy.nic.in/index.htmలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుందని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే దళారుల్ని నమ్మి మోసపోవద్దని అధికారులు సూచించారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి

మొదట ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమో రెండో దశకు ఎంపిక చేశారు. రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తున్నారు. ఇక అగ్నివీర్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మొదట అభ్యర్థులు joinindianarmy.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. తమ అర్హతకు సంబంధించిన వివరాలను చెక్‌ చేసుకొని ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఫిబ్రవరి 16 నుంచి మొదలై మార్చి 15 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌ పరీక్ష కోసం రూ.250 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేసేటప్పుడు నకిలీ, అసంపూర్ణంగా, తప్పుగా ఉంటే తిరస్కరిస్తారు. ప్రస్తుతం రెగ్యులర్‌గా వినియోగించే ఈ మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లను మాత్రమే ఇవ్వాలి. అభ్యర్థులు ఐదు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొనే వీలు ఉంది. మొదటి మూడు ఆప్షన్‌ ఆధారంగా పరీక్షా కేంద్రాన్ని కేటాయించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్థులు తమ ఆధార్‌ నంబర్‌ను ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో ఇవ్వాలి. అగ్నివీర్‌ల విద్యా అర్హతలు తదితర వివరాల కోసం నోటిఫికేషన్‌ను చూడొచ్చు.