Amaravati | అమరావతి కేసు విచారణ.. జులై 11కి వాయిదా

విధాత‌: తొందరకు ఆలస్యమే పెద్ద మొగుడు అన్నట్లుగా మారింది. తాను ఎంత త్వరగా విశాఖ మారిపోదాం అని జగన్ (YS Jaganmohan Reddy) ప్రయత్నిస్తుంటే ఆ ప్రక్రియ అంత ఆలస్యం అవుతోంది. వివిధ న్యాయ ప్రక్రియల వాళ్ళ జగన్ ఆశలు నెరవేరడం లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఉగాదికి విశాఖ వెళ్ళిపోతాను అని గ్లోబల్ పెట్టుబడుల సమ్మిట్ లో జగన్ గ్రాండ్‌గా ప్రకటన చేసారు. కానీ కోర్టు కేసుల వాళ్ళ కుదరలేదు. పోన్లే ఉగాది కాకుంటే […]

  • By: Somu    latest    Mar 28, 2023 12:38 PM IST
Amaravati | అమరావతి కేసు విచారణ.. జులై 11కి వాయిదా

విధాత‌: తొందరకు ఆలస్యమే పెద్ద మొగుడు అన్నట్లుగా మారింది. తాను ఎంత త్వరగా విశాఖ మారిపోదాం అని జగన్ (YS Jaganmohan Reddy) ప్రయత్నిస్తుంటే ఆ ప్రక్రియ అంత ఆలస్యం అవుతోంది. వివిధ న్యాయ ప్రక్రియల వాళ్ళ జగన్ ఆశలు నెరవేరడం లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.

ఉగాదికి విశాఖ వెళ్ళిపోతాను అని గ్లోబల్ పెట్టుబడుల సమ్మిట్ లో జగన్ గ్రాండ్‌గా ప్రకటన చేసారు. కానీ కోర్టు కేసుల వాళ్ళ కుదరలేదు. పోన్లే ఉగాది కాకుంటే ఇంకో ముహూర్తం చూద్దాం అనుకుని జులై లో వెళ్తాను అని జగన్ ఫిక్స్ అయ్యారు.

ఈలోపు కోర్ట్ కేసులు క్లియర్ అవుతాయని ఆయన భావించినా అవి అయ్యేలా లేదు… ప్రస్తుతం జరుగుతున్నా విచారణను జులై 11వ‌ తేదికి వాయిదా వేస్తూ సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కు అమరావతినే తాము రాజధానిగా పరిగణిస్తున్నట్లు ఏపీ హైకోర్టు గతంలో స్పష్టం చేసింది.

ఈ మేరకు అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. అయితే మరోవైపు హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ అమరావతి రైతులు సుప్రీం కోర్టుకు(Supreme court) విన్నవించారు.

ఈ రెండు పిటిషన్లూ న్యాయమూర్తి కె. ఎం. జోసెఫ్, బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి ఈ కేసును జులై 11 కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి

ఆంధ్ర ప్రదేశ్ అమరావతి విభజన చట్టం ప్రకారమే అమరావతి(Amaravathi) రాజధానిగా ఏర్పడిందని కేంద్రం స్పష్టం చేసింది. జగన్ మూడు రాజధానుల గురించి తమకు తెలియదాని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. దీంతో జగన్ గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. దీనికి విరుగుడు ఏమిటో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

మరోవైపు జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానితో భేటీ ఉంటుంది. ఈ సందర్భంగా అమరావతి, రాజధాని విశాఖకు మార్పు వంటి కీలక అంశాలు ప్రధాని వద్ద చర్చకు వస్తాయి అంటున్నారు. మొత్తానికి జగన్ ఎంత త్వరగా విశాఖ పోదాం అనుకుంటుంటే ఇటు కోర్టులు అంత అడ్డంకులు సృష్టిస్తున్నాయి.