Anasuya | అల్లు అర్జున్ హీరోనా.. ఆ పాట‌లో అస్స‌లు చూడ‌లేక‌ పోయా: అన‌సూయ

Anasuya: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో యాంక‌ర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అన‌సూయ సోష‌ల్ మీడియాలో త‌న అందచందాలు ఆర‌బోస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెంచుకుంది. కెరీర్ మంచిగా సాగుతున్న స‌మ‌యంలో ఈ అమ్మ‌డు ప‌లువురు హీరోల‌ని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తుంది. అన‌సూయ ఎనిమిదేళ్ల క్రితం బ‌న్నీపై దారుణ‌మైన కామెంట్స్ చేసింది. అప్పుడు సోష‌ల్ మీడియా అంత విస్తృతంగా లేదు కాబ‌ట్టి ఆ వీడియో వైర‌ల్ కాలేదు. కాని ఇప్పుడు అన‌సూయ ఎనిమిదేళ్ల క్రితం మాట్లాడిన వీడియో […]

  • By: sn    latest    Jul 13, 2023 8:39 AM IST
Anasuya | అల్లు అర్జున్ హీరోనా.. ఆ పాట‌లో అస్స‌లు చూడ‌లేక‌ పోయా: అన‌సూయ

Anasuya:

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో యాంక‌ర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అన‌సూయ సోష‌ల్ మీడియాలో త‌న అందచందాలు ఆర‌బోస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెంచుకుంది. కెరీర్ మంచిగా సాగుతున్న స‌మ‌యంలో ఈ అమ్మ‌డు ప‌లువురు హీరోల‌ని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తుంది.

అన‌సూయ ఎనిమిదేళ్ల క్రితం బ‌న్నీపై దారుణ‌మైన కామెంట్స్ చేసింది. అప్పుడు సోష‌ల్ మీడియా అంత విస్తృతంగా లేదు కాబ‌ట్టి ఆ వీడియో వైర‌ల్ కాలేదు. కాని ఇప్పుడు అన‌సూయ ఎనిమిదేళ్ల క్రితం మాట్లాడిన వీడియో క్లిప్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఈ వీడియో బ‌న్నీ ఫ్యాన్స్ తో పాటు ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ ప‌రుస్తుంది.

అస‌లు అనసూయ ఇలాంటి కామెంట్స్ చేయడమేంటి? అని అంతా ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట పెద్ద దుమారమే రేపుతుంది. ఇంతకి అనసూయ ఆ వీడియోలో ఏమ‌ని మాట్లాడింది అంటే..

అస‌లు అల్లు అర్జున్‌ హీరో ఏంటీ? మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా? ‘గంగోత్రి’ సినిమా చూసాక అసలు మనవాళ్లకి ఏమైంది అని ఆశ్చర్యం వేసింది. ఓ ఆ పాటలో మాత్రం ఆయ‌న‌ని అస్సలు చూడలేకపోయాను.. అల్లు అర్జున్‌ లేడీ గెటప్‌లో కనిపించ‌డం ఏంట‌ని వెల్ల‌డించింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా, బ‌న్నీ ఫ్యాన్స్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమాతో దాక్షాయ‌ణి అనే నెగెటివ్ రోల్ చేసిన అన‌సూయ ఇప్పుడు పుష్ప 2 కూడా చేస్తుంది. అయితే అన‌సూయ ఇటీవ‌ల ఎక్కువ‌గా వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తుంది. ఆ మ‌ధ్య విజయ్ దేవ‌ర‌కొండ‌ని ఉద్దేశించి దారుణ‌మైన కామెంట్స్ చేసింది.

దాంతో రౌడీ బాయ్ ఫ్యాన్స్ అన‌సూయ‌ని ఆడుకున్నారు. కొన్ని రోజుల త‌ర్వాత తాను మ‌న‌శ్శాంతి కోసం ఈ గొడ‌వ‌కి పులిస్టాప్ పెట్టాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలిపింది. అయితే ఇప్పుడు ప్ర‌శాంతంగా ఉండాల‌ని భావించిన అన‌సూయ‌ని ఈ వీడియో మాత్రం కంటిపై కునుకు లేకుండా చేస్తుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.