Agniveers | అగ్నివీరులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. బీఎస్‌ఎఫ్‌లో 10శాతం రిజర్వేషన్లు..!
Agniveers | అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మాజీ అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్‌లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించింది. అగ్నివీరులుగా సేవలందించి రిటైర్డ్ అయ్యే అభ్యర్థులకు బీఎస్ఎఫ్ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దాంతో పాటు అగ్నిపథ్ మొదటి బ్యాచ్ లేదా తర్వాత బ్యాచ్‌లకు చెందిన వారా? అనే దాని ఆధారంగా గరిష్ఠ వయోపరమితి ఆధారపడి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్‌ఎఫ్-1968 చట్టం ప్రకారం.. నియామక ప్రక్రియను […]

Agniveers | అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మాజీ అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్‌లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించింది. అగ్నివీరులుగా సేవలందించి రిటైర్డ్ అయ్యే అభ్యర్థులకు బీఎస్ఎఫ్ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దాంతో పాటు అగ్నిపథ్ మొదటి బ్యాచ్ లేదా తర్వాత బ్యాచ్‌లకు చెందిన వారా? అనే దాని ఆధారంగా గరిష్ఠ వయోపరమితి ఆధారపడి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బీఎస్‌ఎఫ్-1968 చట్టం ప్రకారం.. నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జనరల్ డ్యూటీ కేడర్-2015లో ఇందుకు సంబంధించి నిబంధనలు సవరించనున్నట్లు కేంద్రం తెలిపింది. సవరించిన నిబంధనలు మార్చి 9వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. బీఎస్ఎఫ్ నియమకాలకు సంబంధించి అగ్నివీర్ మొదటి బ్యాచ్లో చేరి విశ్రాంతి తీసుకునే సైనికులకు ఐదు సంవత్సరాలు, ఆ తర్వాతి బ్యాచుల్లో సేవలందించి.. రిటైర్డ్ అయిన అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు గరిష్ఠ వయోపరిమితిని సడలిస్తున్నట్లు తెలిపింది. అలాగే మాజీ అగ్నివీరులకు బీఎస్ఎఫ్ నియామక ప్రక్రియలోని దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది.