Viveka Murder Case | వివేకా హత్య కేసులో ట్విస్ట్.. మాపై YS సునీత కక్ష కట్టింది! వివేకా రెండో భార్య షమీమ్ ఫిర్యాదు
Viveka Murder Case విధాత: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు విషయంలో వివేకా కుమార్తె సునీత.. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలు తమ వేలును వైయస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపు చూపుతుండగా ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అవినాష్ ను కూడా అరెస్ట్ చేయాలని చూస్తోంది. ఇక అవినాష్.. జగన్ ఈ […]

Viveka Murder Case
విధాత: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు విషయంలో వివేకా కుమార్తె సునీత.. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలు తమ వేలును వైయస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపు చూపుతుండగా ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అవినాష్ ను కూడా అరెస్ట్ చేయాలని చూస్తోంది.
ఇక అవినాష్.. జగన్ ఈ శిబిరం మాత్రం ఆ హత్యతో తమకు సంబంధం లేదని, కూతురు, అల్లుడు .ఇంకా ఆయన రెండో పెళ్లి కారణంగానే ఆ హత్య జరిగిందని, ఆస్తికోసం ఆ హత్యను నర్రెడ్డి చేయించారని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు సడెన్‌గా వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐ ఎదుట హాజరై వాంగ్ములం ఇచ్చారు. వివేకాతో జరిగిన తన పెళ్లిని సునీత ఆయన భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంగీకరించలేదని.. వివేకా ఇంకో బావమరిది హత్యకు కొన్ని గంటల ముందు నేను వైయస్ వివేకాతో మాట్లాడాను.
బెంగళూరులోని ఆస్తుల సెటిల్ మెంట్ ద్వారా రూ.8 కోట్లు వస్తాయని చెప్పారు. వివేకా ఆస్తులపైన బావమరిది శివప్రకాష్ రెడ్డి కన్నువేశారని.. రెండో భార్యగా తనకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆయనను కుటుంబానికి దూరం పెట్టారని వివరిస్తూ ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు జరపాలని ఆమె సీబీఐ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.
తనకు వివేకాకు పుట్టిన కుమారుడు షాహెన్షాకు నాలుగు ఎకరాల భూమి కొనివ్వాలని వివేకా భావించినా ఆ కుటుంబీకులు అడ్డుకున్నారని, వారంతా వివేకానంద రెడ్డిని ఇబ్బంది పెట్టారని షమిమ్ వివరించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని ఆమె కోరారు.
ఈ నేపథ్యంలో కేసు కొత్త మలుపు తిరిగినట్లు అయింది. అవినాష్ తదితరులు మొదటి నుంచీ చెబుతున్నట్లు ఇది ఆస్తి తగాదా మాత్రమే..దానికి అల్లుడు..ఆయన బంధువులే కారణం అనే కోణంలో విచారణ చేయాల్సి వస్తుంది.