అనుష్కా శెట్టి: ఇలా అయిపోయిందేంటి.. కెరీర్ ముగిసినట్లేనా!

ANUSHKA SHETTY విధాత‌, సినిమా: అనుష్క శెట్టి టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌‌గా వెలిగింది. బడా స్టార్ హీరోల చిత్రాలలో నటించడమే కాక.. అరుంధతి, భాగమతి, పంచాక్షరి వంటి చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. ఓ వైపు హీరోయిన్‌గా.. మరోవైపు లేడి ఓరియంటెడ్ చిత్రాలతో కూడా తన సత్తా చాటింది. ఇక అనుష్క బాహుబలి తర్వాత రుద్రమదేవి చిత్రంలో నటిస్తూనే ‘సైజ్ జీరో’ అంటూ ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించింది. ఇదే ఆమె చేసిన ఘోర తప్పిదంగా […]

అనుష్కా శెట్టి: ఇలా అయిపోయిందేంటి.. కెరీర్ ముగిసినట్లేనా!

ANUSHKA SHETTY

విధాత‌, సినిమా: అనుష్క శెట్టి టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌‌గా వెలిగింది. బడా స్టార్ హీరోల చిత్రాలలో నటించడమే కాక.. అరుంధతి, భాగమతి, పంచాక్షరి వంటి చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. ఓ వైపు హీరోయిన్‌గా.. మరోవైపు లేడి ఓరియంటెడ్ చిత్రాలతో కూడా తన సత్తా చాటింది.

ఇక అనుష్క బాహుబలి తర్వాత రుద్రమదేవి చిత్రంలో నటిస్తూనే ‘సైజ్ జీరో’ అంటూ ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించింది. ఇదే ఆమె చేసిన ఘోర తప్పిదంగా మారింది. ఈ చిత్రం కోసం అనుష్క బాగా లావు అయింది. భారీగా బరువు పెరిగింది.

ఈ సినిమా పెద్దగా ఆడింది కూడా లేదు. కానీ అనుష్క కెరీర్‌ను అత‌లాకుతం చేసింది. ఫేడవుట్ అయ్యే వరకు వచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.

అయితే తాజాగా శివరాత్రి పండుగ వేళ తమిళనాడులో సద్గురు నిర్వహించే జాగరణ కార్యక్రమానికి అనుష్క తల్లిదండ్రులతో పాటు హాజరైంది. ఈ క్రమంలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇందులో అనుష్క భారీ శరీరంతో కనిపించడంతో అయ్యో.. అనుష్క ఇలా అయిపోయిందేంటి? అంటూ ఈ ఫొటోలు చూసిన వారంతా మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్‌లో ఆమెకు సినిమాలు చేసే ఆలోచన ఉందా లేదా అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

సాధారణంగా అనుష్క మీడియా ముందుకు రాదు. ఫొటోషూట్స్ వంటివి కూడా చేయదు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా చాలా అరుదుగా పెడుతుంటుంది. దీంతో అనుష్క ఎలా ఉన్నారని బయటకు వస్తే తప్ప తెలియదు.

ఇక కొన్నాళ్లుగా ఇంటికి ప‌రిమిత‌మైన అనుష్క.. ప్రస్తుతం ఒకే ఒక చిత్రంలో నటిస్తోంది. అది కూడా యంగ్ హీరో నవీన్ పోలీశెట్టితో. త‌న క‌న్న చిన్న‌వాడైన న‌వీన్ పోలిశెట్టితో అనుష్క నటిస్తున్నదంటే ఈ చిత్రంలో ఏదో ఒక కొత్త‌ద‌నం ఉంటుంద‌ని అంద‌రూ ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పోలిశెట్టి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.