ఏపీలో 30 మంది ఐపీఎస్ ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 30 మంది ఐపీఎస్ లను వివిధ ప్రాంతాలకు స్థానచలనం కల్పిస్తూ, వారికి స్థానాలను కేటాయించింది

ఏపీలో 30 మంది ఐపీఎస్ ల బదిలీ

– 30 మందికి స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

– ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బదిలీలపై తీవ్ర చర్చ

విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 30 మంది ఐపీఎస్ లను వివిధ ప్రాంతాలకు స్థానచలనం కల్పిస్తూ, వారికి స్థానాలను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కాగా ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఐపీఎస్ లను కీలక స్థానాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఉన్నఫలంగా బదిలీలకు తెరలేపిందన్న వాదనలూ లేకపోలేదు. ఐజీ, డీఐజీ, ఎస్పీలు 30 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులిచ్చింది.

బదిలీ అయిన అధికారులు, కేటాయించిన స్థానాలు ఇవే..

1. రైల్వే పోలీస్ అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్

2. ఏపీపీఎస్సీ అదనపు డీజీగా అతుల్ సింగ్

3. ఆక్టోపస్ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్, రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజీగాను శ్రీకాంత్ కు అదనపు బాధ్యతలు

4. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కొల్లి రఘురామిరెడ్డి. డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు

5. రాష్ట్రస్థాయి పోలీస్ నియామక బోర్డు చైర్మన్ గా రాజశేఖర్ బాబు, హోంగార్డ్స్ ఐజీగా అదనపు బాధ్యతలు

6. పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజీగా హరికృష్ణ, టెక్నికల్ సర్వీసెస్ ఐజీగా అదనపు బాధ్యతలు

7. ఆక్టోపస్ డీఐజీగా సెంథిల్ కుమార్, శాంతిభద్రతల డీఐజీగా అదనపు బాధ్యతలు

8. పోలీసు శిక్షణ డీఐజీగా రాహుల్ దేవ్ శర్మ

9. విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని

10. కర్నూలు రేంజ్ డీఐజీ గా సీహెచ్ విజయ రావు

11. విశాఖ సంయుక్త పోలీస్ కమిషనర్ గా ఫకీరప్ప

12. కృష్ణాజిల్లా ఎస్పీగా అద్నాన్ నయీం ఆస్మి

13. ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్దార్

14. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్

15. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా హజిత వేజెండ్ల

16. రాజమండ్రి విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ గా సుబ్బారెడ్డి

17. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా వై రిశాంత్ రెడ్డి, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతలు

18. చిత్తూరు ఎస్పీగా జోషువా

19. ఏసీబీ ఎస్పీగా రవి ప్రకాష్

20. విశాఖ శాంతిభద్రతల డీసీపీగా సీహెచ్ మణికంఠ

21. ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ గా అది రాజ్ సింగ్ రాణా

22. కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ గా కృష్ణ కాంత్ పటేల్

23. గుంటూరు ఎస్పీగా తుషార్

24. జగ్గయ్యపేట డీసీపీ గా కే శ్రీనివాసరావు

25. రంపచోడవరం ఏఎస్పీగా కే ధీరజ్

26. పాడేరు ఏఎస్పీగా ఏ జగదీష్

27. విజయవాడ డీసీపీగా ఆనంద రెడ్డి

28 . విశాఖ డీసీపీగా సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

[2:08 pm, 30/01/2024] +91 94411 84111: దళిత శక్తి జిల్లా నాయకుడి హత్య

– పాత కక్షలే కారణమంటున్న స్థానికులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హన్మకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామంలో దారుణహత్య జరిగింది. దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల యుగేంధర్ (32) హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపేశారు. పాత కక్షలతోనే యుగంధర్‌ను హత్య చేసినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.