అసెంబ్లీ లోపలా.. బయటా ఓరు’ఘల్లు’

విపక్షాలపై యువ ఎమ్మెల్యేల ఫైర్ అభివృద్ధి చర్చల్లో తగిన అవకాశం సమస్యల ప్రస్తావనలో ముందంజ కేటీఆర్ మార్క్‌కు ప్రాధాన్యతా? విపక్ష పాత్రలో ఎమ్మెల్యే సీతక్క విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ లోపలా.. బయటా ఓరుగల్లు జిల్లా ఎమ్మెల్యేల హవా కొనసాగింది. వివిధ అంశాలపై జరిగిన చర్చల్లో మెజారిటీ ఎమ్మెల్యేలకు, అందులో యువ ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం కల్పించారు. ఇందులో కూడా మంత్రి కేటీఆర్ కు సానుకూలంగా ఉండే యువ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లభించడం ఏదో […]

అసెంబ్లీ లోపలా.. బయటా ఓరు’ఘల్లు’
  • విపక్షాలపై యువ ఎమ్మెల్యేల ఫైర్
  • అభివృద్ధి చర్చల్లో తగిన అవకాశం
  • సమస్యల ప్రస్తావనలో ముందంజ
  • కేటీఆర్ మార్క్‌కు ప్రాధాన్యతా?
  • విపక్ష పాత్రలో ఎమ్మెల్యే సీతక్క

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ లోపలా.. బయటా ఓరుగల్లు జిల్లా ఎమ్మెల్యేల హవా కొనసాగింది. వివిధ అంశాలపై జరిగిన చర్చల్లో మెజారిటీ ఎమ్మెల్యేలకు, అందులో యువ ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం కల్పించారు. ఇందులో కూడా మంత్రి కేటీఆర్ కు సానుకూలంగా ఉండే యువ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లభించడం ఏదో సంకేతంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బయట మీడియా పాయింట్ వేదికగా రాష్ట్ర రాజకీయ ఆరోపణలపై, విపక్ష నేతలపై విరుచుకపడడంలో ఈ యువ ఎమ్మెల్యేలు ముందు వరుసలో ఉన్నారు.

ఏదో రూపంలో బడ్జెట్ సెషన్స్, సెషన్లో భాగస్వామ్యం అయ్యారు. తమ శాఖల సమస్యలపై జరిగే చర్చల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సహజంగానే తమ పాత్ర నిర్వహించారు. ఇక శాసనసభ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్ ఫ్లోర్ కోఆర్డినేషన్‌లో తన వంతు పాత్ర చేపట్టారు. ఈ కో- ఆర్డినేషన్ సమావేశాల సందర్భంగా సాగిపోతూనే ఉంటుంది. శాసనసభ వేదికగా ఆయా శాఖ మంత్రులకు నియోజకవర్గ అభివృద్ధి పై వినతి పత్రాలు సమర్పించారు.

పెన్షన్ల పై మంత్రి ఎర్రబెల్లి

దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తున్నది అంటూ అసెంబ్లీలో శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో 29 లక్షలు మందికి పెన్షన్లు ఇవ్వగా, ఇప్పుడు 44 లక్షల 12 వేల 882 మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అప్పుడు రూ.200 ఇప్పుడు రూ.2వేలు ఇస్తున్నామన్నారు. అప్పట్లో ఏటా రూ. 861 కోట్లు ఇవ్వగా…ఇప్పుడు రూ. 12వేల కోట్లు కేటాయించామన్నారు.

మైనారిటీలపై చీఫ్ విప్ వినయ్

మైనారిటీ కార్పొరేషన్ రుణాలు పొందేందుకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి అదనంగా 500 యూనిట్లు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ విఫ్, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కోరారు.

రేవంత్ పై మూకుమ్మడి దాడి

పాదయాత్రలో ప్రజల స్పందన కరువైన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం కోసం ప్రగతి భవన్ మీద నక్సలైట్లు గ్రెనేడ్లు వేయాలని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని వరంగల్ జిల్లా నేతలంతా మూకుమ్మడి దాడి చేశారు. మీడియా పాయింట్ వేదికగా బుధవారం మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్ కలిసి హెచ్చరించారు.

వ్యవసాయంపై పెద్ది సుదర్శన్ రెడ్డి

తెలంగాణ వ్యవసాయాభివృద్ది, సుస్థిర ప్రగతిపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం ప్రసంగించారు. తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వ చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. బుధవారం పాకాల టూరిజం అభివృద్ధిపై మాట్లాడారు.

బీసీ సంక్షేమంపై నన్నపనేని

బీసీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని అసెంబ్లీలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేన నరేందర్ కొనియాడారు. యాదవ, కురుమ, ముదిరాజ్, బెస్త, గౌడన్నలు, చేనేత వర్గాలకు చేయూతగా నిలుస్తుందని అన్నారు. రేషన్ డీలర్ల సమస్యలపై నరేందర్ ప్రస్తావించారు.

జిల్లాల ఏర్పాటుపై ఆరూరి

పరిపాలనా వికేంద్రీకరణ, నిజమైన ప్రజావికాసం అని భావించిన అంబేడ్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా నూతన జిల్లాల ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన చేరువ చేశామని అసెంబ్లీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడారు. సచివాలయాన్ని కూల్చేస్తావా బండి సంజయ్.. బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోందనీ ఆరూరి మీడియా వేదికలో మండిపడ్డారు.

గ్రామీణ అభివృద్ధి పైన చల్లా

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా పల్లెలను బాగుపరచడమే కాకుండా, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి చేపడుతున్నామని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రస్తావించారు.

– రేవంత్‌పై శంకర్ నాయక్ ఫైర్

రేవంత్ రెడ్డి నీ.. బతుకేందో ఆలోచించుకో.. క్యారెక్టర్ లేదూ కనీసం ఎథిక్స్ లేకుండా మాట్లాడుతుండని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ విమర్శించారు.
ప్రగతిభవన్ పేల్చాలన్న రేవంత్ రెడ్డి నక్సలైటా.. రౌడియా.. మానుకోట రాళ్ళ రుచి తెలుసుకో అంటూ హెచ్చరించారు.

– ఆరోపణలపై రెడ్యా నాయక్ ఆగ్రహం

తనపై ఆరోపణలు నిరూపించలేకుంటే మరిపెడలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, బలరాంనాయక్‌ చెప్పుదెబ్బలు తింటారా? అంటూ మీడియా పాయింట్ వద్ద డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ విమర్శించారు.

– పోడు సమస్య పైన ఎమ్మెల్యే సీతక్క

పోడు భూముల సమస్య వెంటనే పరిష్కరించాలని శాసనసభలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో గిరిజనులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. విపక్ష నాయకురాలిగా కరెంటు కోతలపై నిరసన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా శాసనమండలి విప్ ల మార్పులో కూడా కేటీఆర్ మార్క్‌తోపాటు యువత ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కనిపిస్తోంది. రాష్ట్రంలో జరగబోయే బాధ్యతల మార్పుకు పరోక్ష సూచికగా ఈ తాజా పరిణామాలను పరిశీలకులు పరిగణిస్తున్నారు.

– గ్రామీణ అభివృద్ధి పైన చల్లా

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా పల్లెలను బాగుపరచడమే కాకుండా, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి చేపడుతున్నామని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రస్తావించారు.

– రేవంత్ పై శంకర్ నాయక్ ఫైర్

రేవంత్ రెడ్డి నీ..బతుకేందో ఆలోచించుకో..
క్యారెక్టర్ లేదూ కనీసం ఎథిక్స్ లేకుండా మాట్లాడుతుండని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ విమర్శించారు. ప్రగతి భవన్ పేల్చాలన్న రేవంత్ రెడ్డి నక్సలైటా..రౌడియా..మానుకోట రాళ్ళ రుచి తెలుసుకో అంటూ హెచ్చరించారు.

  • – ఆరోపణలపై రెడ్యా నాయక్ ఆగ్రహం

తనపై ఆరోపణలు నిరూపించలేకుంటే మరిపెడలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, బలరాంనాయక్‌ చెప్పుదెబ్బలు తింటారా? అంటూ మీడియా పాయింట్ వద్ద డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ విమర్శించారు.

  • – పోడుసమస్య పైన ఎమ్మెల్యే సీతక్క

పోడు భూముల సమస్య వెంటనే పరిష్కరించాలని శాసనసభలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో గిరిజనులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. విపక్ష నాయకురాలిగా కరెంటు కోతలపై నిరసన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా శాసనమండలి విప్ ల మార్పులో కూడా కేటీఆర్ మార్క్‌తోపాటు యువత ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కనిపిస్తోంది. రాష్ట్రంలో జరగబోయే బాధ్యతల మార్పుకు పరోక్ష సూచికగా ఈ తాజా పరిణామాలను పరిశీలకులు పరిగణిస్తున్నారు.