Canada: కెనడాలో భారతీయ యువతిపై దాడి.. వీడియో వైరల్

కెనడాలో భారత్ పై విద్వేషం నానాటికీ పెరుగుతోంది. తాజాగా ఓ దుండగుడు భారత యువతిపై దాడికి తెగబడ్డాడు. ఆమె గొంతు నులుముతూ ” హత్యా యత్నం” చేశాడు.

  • By: Somu    latest    Mar 26, 2025 12:15 PM IST
Canada: కెనడాలో భారతీయ యువతిపై దాడి.. వీడియో వైరల్

Attack on Indian girl in Canada: కెనడాలో భారత్ పై విద్వేషం నానాటికీ పెరుగుతోంది. తాజాగా ఓ దుండగుడు భారత యువతిపై దాడికి తెగబడ్డాడు. ఆమె గొంతు నులుముతూ ” హత్యా యత్నం” చేశాడు. కాపాడాలంటూ యువతి అరుస్తున్నా అక్కడున్న వారు భయంతో ముందుకు రాలేదు. అయితే జనం పెరుగుతుండటంతో దుండగుడు ఆమెను అక్కడే వదిలేసి వేగంగా వెళ్లిపోయాడు. కాల్గరిలోని బోవ్యాలీ కాలేజీ రైల్వేస్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

 

ఉన్నత చదువులు..ఉద్యోగాల కోసం కెనడా వెళ్లిన భారతీయులపై ఈ రకమైన దాడులు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. కొంత కాలంగా భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. తాజాగా కెనడా గూఢచార ఏజెన్సీ భారత్ పై చేసిన ఆరోపణలు మళ్లీ రెండు దేశాల మధ్య చిచ్చురేపాయి. కెనడాలో ఏప్రిల్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారత్, చైనా లు జోక్యం చేసుకునే అవకాశముందంటూ ఆరోపణలు మరోసారి రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. కెనడా ఆరోపణలను తీవ్రంగా ఖంచించిన భారత విదేశాంగ శాఖ కెనడానే మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని మండిపడింది. ఈ నేపథ్యంలో కెనడా రాజకీయ, పాలనా సంస్థలు చేస్తున్న భారత్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలు ఆ దేశంలోని భారతీయులపై ద్వేషంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.