బాబాయ్ – అబ్బాయ్ త‌గ్గేదేలే అంటున్నారు

విధాత‌, సినిమా: టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్‌‌లుగా వెంకటేష్, రానా నటించిన ‘రానా నాయుడు’, నాగచైతన్య నటించిన ‘దూత’లను చెప్పుకోవచ్చు. వీటిని ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు వీటి జాడలేదు. దాంతో వీటిపై జనాలకు అసలు ఉత్సాహమే పోతున్న దశలో ‘రానా నాయుడు’ ట్రైలర్‌తో మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ దగ్గుబాటి వెంకటేష్, రానాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. వెంకటేష్, రానా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఈ […]

బాబాయ్ – అబ్బాయ్ త‌గ్గేదేలే అంటున్నారు

విధాత‌, సినిమా: టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్‌‌లుగా వెంకటేష్, రానా నటించిన ‘రానా నాయుడు’, నాగచైతన్య నటించిన ‘దూత’లను చెప్పుకోవచ్చు. వీటిని ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు వీటి జాడలేదు. దాంతో వీటిపై జనాలకు అసలు ఉత్సాహమే పోతున్న దశలో ‘రానా నాయుడు’ ట్రైలర్‌తో మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ దగ్గుబాటి వెంకటేష్, రానాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.

వెంకటేష్, రానా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఈ సిరీస్.. హాలీవుడ్ ‘రే డొనోవన్’ సిరీస్‌కి అఫీషియల్ రీమేక్‌గా రూపొందింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్‌ని సుపర్ణ వర్మ, కరణ్ అన్షుమన్ తెరకెక్కించారు. ఈ ట్రైల‌ర్‌లో రానా సూటుబూటు వేసి బాగా క్లాస్‌గా కనిపిస్తుంటే.. వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో మెరిసిన జుట్టు గడ్డంతో కనిపిస్తున్నాడు.

ఈ సిరీస్ ట్రైలర్‌లో వెంకీ రానాలతో పాటు సుర్వీణ్ చావ్లా కీలకపాత్రలో కనిపించారు. స్టోరీ అంతా తండ్రీ కొడుకుల మధ్య జరుగుతుందనేది తెలుస్తుంది. ఎన్నో ఎమోషన్స్, కోపతాపాల మధ్య ఉత్కంఠ భరితంగా రానా నాయుడు ట్రైలర్‌ని కట్ చేశారు. రానా, వెంకీలు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారు. ముఖ్యంగా రానా యాక్షన్ సీన్స్ అదిరిపోతున్నాయి.

ఇందులో నాగ నాయుడుగా నటించిన వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాస్త వయసు పైబడిన లుక్‌లో వెంకీ ఎమోషన్స్‌తో పాటు అంతే బోల్డ్‌గా మెప్పించాడు. రానా వెంకీలతో చివ‌రి ట్విస్ట్ బాగుంది. ఇందులో డైలాగ్స్ కొంచెం నెట్‌ఫ్లిక్స్‌కి తగ్గకుండా బూతులు వినిపించాయి. మార్చి 10వ తారీఖున ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.