Baby Berth In Train | చంటిపిల్లలతో రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం.. బేబీ బెర్తులను ప్రవేశపెడుతున్న భారతీయ రైల్వే..!
Baby Berth In Train | నిత్యం లక్షలాది మంది భారతీయ రైల్వేల్లో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు రైళ్లలో భారతీయ రైల్వే మార్పులు చేస్తూ వస్తున్నది. తాజాగా చంటిపిల్లలతో ప్రయాణించే మహిళలను దృష్టిలో పెట్టుకొని పలు మార్పులు చేస్తూ వస్తున్నది. దాంతో మహిళల ప్రయాణం మరింత సులభతరం కానున్నది. ఐదేళ్లలోపు పిల్లలకు బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. త్వరలో దేశవ్యాప్తంగా రైళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నది. ఇప్పటికే బేబీ బెర్త్‌పై ట్రయల్స్‌ను నిర్వహించగా.. తాజాగా […]

Baby Berth In Train | నిత్యం లక్షలాది మంది భారతీయ రైల్వేల్లో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు రైళ్లలో భారతీయ రైల్వే మార్పులు చేస్తూ వస్తున్నది. తాజాగా చంటిపిల్లలతో ప్రయాణించే మహిళలను దృష్టిలో పెట్టుకొని పలు మార్పులు చేస్తూ వస్తున్నది. దాంతో మహిళల ప్రయాణం మరింత సులభతరం కానున్నది. ఐదేళ్లలోపు పిల్లలకు బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. త్వరలో దేశవ్యాప్తంగా రైళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నది. ఇప్పటికే బేబీ బెర్త్‌పై ట్రయల్స్‌ను నిర్వహించగా.. తాజాగా రెండోసారి ట్రయల్‌ను ప్రారంభించనున్నది. ఇది విజయవంతమైతే అన్ని రైళ్లలో బేబీ బెర్త్‌లకు సంబంధించి మార్పులు చేయనున్నది. అలాగే, బేబీ బెర్త్‌కు సైతం ప్రత్యేకంగా ధరలను రైల్వే బోర్డు నిర్ణయించనున్నది.
గతేడాది నుంచే లక్నో మెయిల్‌లో ట్రయల్స్
వాస్తవానికి భారతీయ రైల్వే లక్నో మెయిల్ రైలులో గతేడాది మేలోనే బెబీ బెర్త్‌లపై ట్రయల్స్‌ను ప్రారంభించింది. కొద్ది రోజులుగా బేబీ బెర్త్‌లపై ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్‌ను తీసుకున్నది. ఈ సందర్భంగా ప్రశంసలతో పాటు పలు లోపాలను ప్రయాణికులు ప్రస్తావించారు. ఈ లోపాలపై దృష్టి పెట్టింది. తాజాగా లోపాలను సరిదిద్ది రెండోసారి ట్రయల్స్‌కు రంగం సిద్ధం చేసింది. గతంలో ఉన్న బెబీ బెర్త్ కంటే ఈ సారి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఈ విధానంపై పని చేస్తున్న అధికారి నితిన్ దేవ్రే తెలిపారు. తల్లీ బిడ్డల బెర్త్‌పై తక్కువ స్థలం కారణంగా కొంత ఇబ్బంది ఎదురైందని, ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని బేబీ బెర్త్‌ను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
సురక్షితంగా.. సౌకర్య వంతంగా..
కొంత డిజైన్ మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంతకు ముందు బేబీ బెర్త్‌లు సాధారణ సీట్ల కోసం తెరిచి ఉండేవని, దాంతో పిల్లలకు గాయాలు కావడం, సామగ్రి పడిపోయే ప్రమాదం ఉండేది. తాజాగా దాన్ని కప్పి ఉంచడంతో పాటు తన బిడ్డలకు తల్లి పాలు ఇచ్చేలా సౌకర్యవంతంగా ఉండనున్నది. ప్రతి కోచ్‌లో ఒక్కో సీటుతో ఈ కొత్త బేబీ బెర్త్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. రైల్వే ఈ బేబీ బెర్త్‌ను టికెట్ బుక్ చేసుకునే సమయంలో బుక్ చేసుకునే వారికి ఈ బేబీ బెర్త్‌ను కేటాయించనున్నది. బేబీ బెర్త్ కోసం ప్రయాణికులు టీటీఈ సంప్రదించినా ప్రత్యేక హుక్ సహాయంతో బేబీ బెర్త్‌ను ఏర్పాటు చేస్తారు. రెండో ట్రయల్స్ విజయవంతమైన తర్వాత దేశవ్యాప్తంగా బేబీ బెర్త్ సౌకర్యం కల్పించనున్నారు. అయితే, రూ.100 వరకు అదనంగా చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తున్నది.