బాలయ్య సినిమా ఒక్క రోజుకే చేతులెత్తేసింది

ఎవరో డబ్బింగ్ చెబితే.. బాలయ్య సినిమా ఆడుతుందా? ఒక్కో స్టార్‌కి ఒక్కో ప్ల‌స్ పాయింట్ ఉంటుంది. చిరంజీవికి డ్యాన్స్‌లు, యాక్ష‌న్ సీన్స్, స్టెప్పులు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనేవి బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఇక బాల‌య్య‌కి ఆయ‌న గొంతు, ఆయ‌న చెప్పే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ వంటివి పెద్ద ఎస్సెట్. ఇక దక్షిణాది చిత్రాల కంటే ఉత్తరాది చిత్రాలలో హిందుత్వానికి సంబంధించిన సినిమాలకు పట్టం కడతారు. హిందుత్వానికి, అలాంటి స్టోరీల‌తో చేసిన చిత్రాల‌కు పెద్దపీట వేస్తారు. వాటిని వారు బాగా ఆదరిస్తారు. […]

  • By: krs    latest    Jan 23, 2023 8:39 AM IST
బాలయ్య సినిమా ఒక్క రోజుకే చేతులెత్తేసింది

ఎవరో డబ్బింగ్ చెబితే.. బాలయ్య సినిమా ఆడుతుందా?

ఒక్కో స్టార్‌కి ఒక్కో ప్ల‌స్ పాయింట్ ఉంటుంది. చిరంజీవికి డ్యాన్స్‌లు, యాక్ష‌న్ సీన్స్, స్టెప్పులు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనేవి బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఇక బాల‌య్య‌కి ఆయ‌న గొంతు, ఆయ‌న చెప్పే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ వంటివి పెద్ద ఎస్సెట్. ఇక దక్షిణాది చిత్రాల కంటే ఉత్తరాది చిత్రాలలో హిందుత్వానికి సంబంధించిన సినిమాలకు పట్టం కడతారు. హిందుత్వానికి, అలాంటి స్టోరీల‌తో చేసిన చిత్రాల‌కు పెద్దపీట వేస్తారు. వాటిని వారు బాగా ఆదరిస్తారు. హిందుత్వ సినిమాలకు ఎక్కడా లేని గుర్తింపు బాలీవుడ్‌లో ఉంది.

ముఖ్యంగా ‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి చిత్రాలు ఈ విషయాన్ని ఇప్పటికే నిరూపించాయి. ‘కార్తికేయ 2’, ‘కాంతార’ వంటి హిందుత్వ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయి. అసలు నార్త్ ఇండియన్స్‌కి పరిచయం లేని హీరోలు డివోషనల్ కంటెంట్‌తో పాన్ ఇండియా స్టార్స్ అయిపోతున్నారు. కార్తికేయ 2 కి ముందు నిఖిల్ సిద్ధార్థ అంటే ఆ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఈ చిత్రం బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం కూడా ఇదే త‌ర‌హాలో రాణిస్తుందని భావించారు. సింహా, లెజెండ్ తర్వాత అంతకుమించిన స్థాయిలో అతిపెద్ద హిట్టు కొట్టిన ‘అఖండ’ మూవీ హిందీ వెర్షన్‌ని తాజాగా రిలీజ్ చేశారు.

కానీ అక్కడ ఆ హిందీ వెర్షన్‌ని నార్త్ ఇండియన్స్ రిజెక్ట్ చేశారు. వాస్తవానికి బాలకృష్ణ ‘అఖండ’ కూడా అఘోరా తరహాలో నిర్మించిన చిత్రం. ఉత్తరాది వారికి శివుడంటే ఎనలేని భక్తి. అక్కడ అఘోరాల జీవితం గురించి అందరికీ ఎంతో బాగా తెలుసు. అఘోరాలకు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు.

దాంతో అక్కడ ‘అఖండ’ చిత్రం రాణిస్తుందని అనుకున్నారు. కానీ అక్కడ ఆ చిత్రం డిజాస్టర్ కలెక్షన్లు వసూలు చేస్తుంది. బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని ఏడు కోట్లు టార్గెట్‌గా బరిలోకి దింపారు. కాగా తొలి రోజు ఈ చిత్రానికి 50 లక్షలు మాత్రమే వసూళ్లు వచ్చాయి. తెలుగులో బాలయ్యని ఒక రేంజ్‌లో నిలబెట్టిన ఈ చిత్రం బాలీవుడ్‌లో పెద్ద దెబ్బ వేసేసింది.

అయితే ఈ సినిమా బాలీవుడ్‌లో ఫెయిల్ కావడానికి డబ్బింగ్ కారణమని అంటున్నారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్‌కి సూట్ అయ్యేలా హిందీలో సరైన వారితో డబ్బింగ్ చెప్పించకపోవడంతో మిస్ ఫైర్ అయింద‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అందుకే అక్కడి వారికి ఈ చిత్రం హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ అస‌లు న‌చ్చ‌లేదంటున్నారు.

అదే ఈ డైలాగులను బాలయ్యే చెప్పి ఉంటే ఆ ఫలితం మరోలా ఉండేది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాల‌య్య హిందీ మాట్లాడ‌టంలో పూర్‌. దాంతో అది సాధ్యం కాక‌నే హిందీలో మ‌రొక‌రితో డ‌బ్బింగ్ చెప్పించార‌ని వాదించేవారు కూడా ఉన్నారు. ఏదైతేనేం.. భారీగా ఊహించుకున్న ‘అఖండ’ బాలీవుడ్‌లో చేతులెత్తేసిందనేలా టాక్ అయితే వచ్చేసింది.