మళ్లీ విజయ్ దేవరకొండని టార్గెట్ చేసిన బండ్ల గణేష్

విధాత: రౌడీ హీరో విజయ్ దేవరకొండ‌ అంటే.. బ్లాక్‌బస్టర్ నిర్మాత బండ్ల గణేష్‌కు అస్సలు పడటం లేదు. గతంలో ‘‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు బ్రదర్.. టాలెంట్ ఉండాలి’’ అంటూ విజయ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్.. తాజాగా మరోసారి తన తుత్తరని ట్విట్టర్ వేదికగా ప్రదర్శించాడు. తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ వెదర్‌ని ఆశ్వాదిస్తూ.. తన తండ్రితో కలిసి బయట లాన్‌లో కాఫీ తాగుతున్న ఫొటోని షేర్ చేశాడు. విజయ్ దేవరకొండ గానీ, ఆనంద్ […]

  • By: krs    latest    Dec 11, 2022 5:56 PM IST
మళ్లీ విజయ్ దేవరకొండని టార్గెట్ చేసిన బండ్ల గణేష్

విధాత: రౌడీ హీరో విజయ్ దేవరకొండ‌ అంటే.. బ్లాక్‌బస్టర్ నిర్మాత బండ్ల గణేష్‌కు అస్సలు పడటం లేదు. గతంలో ‘‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు బ్రదర్.. టాలెంట్ ఉండాలి’’ అంటూ విజయ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్.. తాజాగా మరోసారి తన తుత్తరని ట్విట్టర్ వేదికగా ప్రదర్శించాడు. తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ వెదర్‌ని ఆశ్వాదిస్తూ.. తన తండ్రితో కలిసి బయట లాన్‌లో కాఫీ తాగుతున్న ఫొటోని షేర్ చేశాడు.

విజయ్ దేవరకొండ గానీ, ఆనంద్ దేవరకొండ గానీ.. వారి తల్లిదండ్రులతో ఎలా ఉంటారో ఇప్పటికే పలు సందర్భాలు అందరికీ తెలిసేలా చేశారు. చాలా ఫ్రెండ్లీగా వారంతా ఉంటారు. తల్లిదండ్రులలా కాకుండా.. చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు. విజయ్, ఆనంద్‌లకు సర్వస్వం వాళ్లిద్దరే అన్నట్లుగా, అలాగే పిల్లలు తమ సర్వశ్వం అన్నట్లుగా విజయ్ తల్లిదండ్రులు ఉంటారు.