Bank Holidays In May | బ్యాంకు పనులుంటే ముందే చేసుకోండి.. మేలో 12 సెలవులు..!
Bank Holidays In May | ఏప్రిల్ నెల ముగిసింది. మే నెల వచ్చేసింది. ఈ నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు మూత పడనున్నాయి. ఈ క్రమంలో బ్యాంకు సేవలు, ఏటీఎం సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మే నెలలో ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయనే సమాచారాన్ని ముందుగానే తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన పనులు పూర్తి చేసుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలు ఒక్కోసారి తప్పనిసరిగా పూర్తిచేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ఇబ్బందులు […]

Bank Holidays In May |
ఏప్రిల్ నెల ముగిసింది. మే నెల వచ్చేసింది. ఈ నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు మూత పడనున్నాయి. ఈ క్రమంలో బ్యాంకు సేవలు, ఏటీఎం సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మే నెలలో ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయనే సమాచారాన్ని ముందుగానే తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన పనులు పూర్తి చేసుకోవచ్చు.
ఆర్థిక లావాదేవీలు ఒక్కోసారి తప్పనిసరిగా పూర్తిచేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఏ రోజు బ్యాంకులు మూసి ఉంటాయి, ఏ రోజు తెరిచి ఉంటాయనే కచ్చితమైన సమాచారం తెలుసుకుంటే ఇబ్బందులు తప్పుతాయి.
ఇక మే నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. అయితే, ఈ నెల బ్యాంకు సెలవులు ఒకటో తేదీ నుంచి మొదలవడం గమనార్హం.
మే ఒకటిన కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులు మూసివేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో వరుసగా మూడు బ్యాంకులు పని మూసి వేయనున్నారు. ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు మూసి ఉంటాయి. 21న ఆదివారం, 22న మహారాణా జయంతి, 27న నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు మూత పడనున్నాయి.
సెలవులు ఇలా..
మే 1, 2023 : మేడే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు.
మే 2, 2023 : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిమ్లా బ్యాంకులు మూసివేయనున్నారు.
మే 5, 2023 : బుద్ధ పౌర్ణమి సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బెలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, ముంబయి, నాగ్‌పూర్ న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో మూసివేత.
మే 7, 2023 : ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి.
మే 9, 2023 : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో మూసివేత.
మే 13, 2023 : సెకండ్ శనివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకుల మూసి ఉంటాయి.
మే 14, 2023 : ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసివేత.
మే 16, 2023 : సిక్కీం రాష్ట్ర అవతరణ దినోత్సవం బ్యాంకులు మూత పడనున్నాయి.
మే 21, 2023 : ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా మూసి ఉండనున్నాయి.
మే 22, 2023 : మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా సిమ్లాలో మూసివేయనున్నారు.
మే 27, 2023 : నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
మే 28, 2023 : ఆదివారం సందర్భంగా దేశమంతటా మూసివేయనున్నారు.