Cooperative Bank: సన్నకారు రైతుపై బ్యాంకు ప్రతాపం.. ఇంటి తలుపులు, సామాగ్రి జప్తు

మహబూబాద్ జిల్లాలో సంఘటన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓ సన్నకారు రైతు తీసుకున్న రుణం చెల్లించలేదని ఇంటితలుపులు, సామాగ్రిని బ్యాంకు జప్తు చేసింది. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో బుధవారం జరిగిన ఈ సంఘటన పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మదనాపురం(Madanapuram) గ్రామానికి చెందిన మోహన్(mohan) అనే సన్నకారు రైతు 2021లో స్థానిక సహకార బ్యాంకు(Cooperative Bank)లో క్రాప్ లోన్(Crop Loan) తీసుకున్నాడు. సకాలంలో రుణం కిస్తీ చెల్లిచనందున బ్యాంక్ అధికారులు సిబ్బంది ఇంటికి వెళ్లి […]

Cooperative Bank: సన్నకారు రైతుపై బ్యాంకు ప్రతాపం.. ఇంటి తలుపులు, సామాగ్రి జప్తు
  • మహబూబాద్ జిల్లాలో సంఘటన

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓ సన్నకారు రైతు తీసుకున్న రుణం చెల్లించలేదని ఇంటితలుపులు, సామాగ్రిని బ్యాంకు జప్తు చేసింది. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో బుధవారం జరిగిన ఈ సంఘటన పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మదనాపురం(Madanapuram) గ్రామానికి చెందిన మోహన్(mohan) అనే సన్నకారు రైతు 2021లో స్థానిక సహకార బ్యాంకు(Cooperative Bank)లో క్రాప్ లోన్(Crop Loan) తీసుకున్నాడు. సకాలంలో రుణం కిస్తీ చెల్లిచనందున బ్యాంక్ అధికారులు సిబ్బంది ఇంటికి వెళ్లి తలుపులు పీకి సామాగ్రిని ఆటోలో తీసుకెళ్లారు. కారణలేమైనా హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మూడు నెలల నుంచి బ్యాంకుకు తాను చెల్లించాల్సిన కిస్తీ డబ్బులు చెల్లించడం లేదు. దీంతో బ్యాంకు అధికారులు ఈ చర్యకు దిగారు.

కాగా, రైతు మోహన్ హైదరాబాద్‌లో ఉంటుండటంతో ఆయన స్వగ్రామమైన మదనాపురంలో నివాసం ఉంటున్న ఆయన కుమారుడు వీరేందర్ ఇంటికి వెళ్లారు. బ్యాంకు మేనేజర్‌తో పాటు సిబ్బంది ఇంటికొచ్చి బలవంతంగా ఇంటి తలుపులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గూడ్స్ ఆటోలోకి ఎక్కించి బ్యాంక్‌కు తీసుకెళ్లారు. బ్యాంకు అధికారుల తీరు పట్ల స్థానికంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.