కుక్క ఎదురు దాడి.. తోక ముడిచిన చిరుత పులి: వీడియో వైరల్
Dod vs Tiger | చిరుతలు తమ కళ్ల ముందు కనిపించే చిన్న జంతువులపై దాడి చేసి క్షణాల్లో చంపేస్తాయి. కానీ అవే చిన్న జంతువులు చిరుతను భయపెట్టించడం చూశారా? కానీ ఓ కుక్క మాత్రం చిరుతపై ఎదురుదాడికి దిగింది. కుక్క దెబ్బకు చిరుత తోక ముడిచింది. మీరు చదువుతున్నది నిజమే. అది దట్టమైన అడవి. మట్టిరోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డుపై ఓ కుక్క హాయిగా నిద్రిస్తుంది. అంతలోనే ఓ చిరుత గాండ్రిస్తూ రోడ్డుపైకి వచ్చింది. […]

Dod vs Tiger | చిరుతలు తమ కళ్ల ముందు కనిపించే చిన్న జంతువులపై దాడి చేసి క్షణాల్లో చంపేస్తాయి. కానీ అవే చిన్న జంతువులు చిరుతను భయపెట్టించడం చూశారా? కానీ ఓ కుక్క మాత్రం చిరుతపై ఎదురుదాడికి దిగింది. కుక్క దెబ్బకు చిరుత తోక ముడిచింది. మీరు చదువుతున్నది నిజమే.
అది దట్టమైన అడవి. మట్టిరోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డుపై ఓ కుక్క హాయిగా నిద్రిస్తుంది. అంతలోనే ఓ చిరుత గాండ్రిస్తూ రోడ్డుపైకి వచ్చింది. కుక్కకు క్షణాల్లోనే మెలకువ వచ్చింది. కానీ కుక్క బెదరలేదు. చిరుతపై ఎదురుదాడికి దిగింది. తన శక్తినంతా కూడగట్టి కుక్క మొరిగింది.
ఆ దెబ్బకు చిరుత భయపడింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. తాను వచ్చిన దారిలో తిరిగి వెళ్లిపోయింది. అనంతరం కుక్క కూడా అక్కడ్నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను జైకీ యాదవ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశాడు. ఒక వేళ ఆ కుక్క భయపడి ఉంటే.. కచ్చితంగా దాన్ని చిరుత చంపేసి ఉండేదని జైకీ యాదవ్ పేర్కొన్నాడు. కుక్క ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటూ, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
DOG VS LEOPARD pic.twitter.com/c0sSobP7lk
— vidhaathanews (@vidhaathanews) November 7, 2022