BB Nagar | 17 కోట్లతో చెరువులకు సొబగులు భువనగిరి, బీబీనగర్ లో ఆధునీకరణ పనులు
BB Nagar నేడు హెచ్ఎండీఏ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన విధాత, హైదరాబాద్ : బీబీనగర్, భువనగిరి చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్ల నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ఈ చెరువులకు కొత్త అందాలు అద్దనున్నారు. హైదరాబాద్ లో జంటనగరాలను కలిపి ట్యాంక్ బండ్ తరహాలో బీబీనగర్, భువనగిరి చెరువుల ట్యాంక్ బండ్ లను ప్రటిష్టపరచడంతో పాటు, వాటిపై పచ్చని అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని […]

BB Nagar
నేడు హెచ్ఎండీఏ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
విధాత, హైదరాబాద్ : బీబీనగర్, భువనగిరి చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్ల నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ఈ చెరువులకు కొత్త అందాలు అద్దనున్నారు.
హైదరాబాద్ లో జంటనగరాలను కలిపి ట్యాంక్ బండ్ తరహాలో బీబీనగర్, భువనగిరి చెరువుల ట్యాంక్ బండ్ లను ప్రటిష్టపరచడంతో పాటు, వాటిపై పచ్చని అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చే విధంగా పలు రకాల పూలమొక్కలు, బొమ్మలు పిల్లల కోసం ఆటపరికరాలు, పాదచారుల కోసం వాక్ వేస్(నడకదారులు), యువతీ యువకుల కోసం జిమ్ పరికరాలను (జిమ్ ఎక్విప్ మెంట్), సందర్శకులు సేదతీరేందుకు బెంచీలు, చెరువు అందాలను వీక్షించేందుకు వ్యూ పాయింట్స్ వంటివి హెచ్ఎండీఏ ఏర్పాటు చేయనున్నది. సోమవారం పనులకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.