WPL-2023 | ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌… మార్చి 4న గుజరాత్‌-ముంబయి మధ్య తొలి మ్యాచ్‌

WPL-2023 | వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది. మార్చి 4న ముంబయి డీవై పాటిల్‌ స్టేడియంలో గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో లీగ్‌ షురూకానున్నది. మొత్తం 20 లీగ్‌ మ్యాచ్‌లు, రెండు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియం, డీవై పాటిల్‌ స్టేడియాల్లో మాత్రమే జరుగుతాయి. లీగ్ దశలోని చివరి గేమ్ మార్చి 21న బ్రబౌర్న్ స్టేడియంలో యూపీ వారియర్స్‌ […]

WPL-2023 | ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌… మార్చి 4న గుజరాత్‌-ముంబయి మధ్య తొలి మ్యాచ్‌

WPL-2023 | వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది. మార్చి 4న ముంబయి డీవై పాటిల్‌ స్టేడియంలో గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో లీగ్‌ షురూకానున్నది. మొత్తం 20 లీగ్‌ మ్యాచ్‌లు, రెండు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియం, డీవై పాటిల్‌ స్టేడియాల్లో మాత్రమే జరుగుతాయి. లీగ్ దశలోని చివరి గేమ్ మార్చి 21న బ్రబౌర్న్ స్టేడియంలో యూపీ వారియర్స్‌ – ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య చివరి లీగ్‌ మ్యాచ్‌ జరుగనున్నది.

మార్చి 24న డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్‌, 26న బ్రబౌర్న్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉండగా.. ప్రీమియర్‌ లీగ్‌ సందర్భంగా సోమవారం వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. వేలంలో భారత క్రికెటర్‌ స్మృతి మంధానాను రూ.3.40కోట్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకున్నది. అలాగే టీమ్‌ ఇండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ను ముంబయి ఇండియన్స్‌ రూ.1.80కోట్లకు కొనుగోలు చేసింది. ఇక విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ నటాలీ స్కివర్ గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ రూ.3.20కోట్లకు కొనుగోలు చేశాయి. భారత యువ సంచలనం, అండర్‌-19 కెప్టెన్‌ షఫాలీ వర్మను రూ.2కోట్లకు ఢిల్లీ క్యాపిట్స్‌ కొనుగోలు చేసింది.