Bhuvanagiri | రోటీన్‌గానే ఐటీ దాడులు: MLA శేఖర్‌రెడ్డి

Bhuvanagiri విధాత: తనపై సాగిన ఐటీ శాఖ దాడులు రొటీన్ లో భాగంగానే జరిగాయని భువనగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఐటీ దాడుల అనంతరం భువనగిరి చేరుకున్న శేఖర్ రెడ్డికి బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపారం వేరు రాజకీయం వేరన్నారు. బిజినెస్ లో సంపాదించాను.. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. నియోజకవర్గ […]

Bhuvanagiri | రోటీన్‌గానే ఐటీ దాడులు: MLA శేఖర్‌రెడ్డి

Bhuvanagiri

విధాత: తనపై సాగిన ఐటీ శాఖ దాడులు రొటీన్ లో భాగంగానే జరిగాయని భువనగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఐటీ దాడుల అనంతరం భువనగిరి చేరుకున్న శేఖర్ రెడ్డికి బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపారం వేరు రాజకీయం వేరన్నారు.

బిజినెస్ లో సంపాదించాను.. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను వరుసగా రెండు సార్లు గెలిపించి తనను ఆదరించారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ నన్ను మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మూడు రోజుల పాటు సోదాలు చేసిన ఐటి అధికారులు ఆన్ హ్యాపీ గా వెళ్లారన్నారు.

ఐటి దాడులు వ్యాపార సంబంధించిన అంశమని, రాజకీయ కుట్ర అని నేను మాట్లాడలేనన్నారు. ఐటి దాడులు చేసిన అధికారులు సక్సెస్ కాలేదన్నారు. మీడియాలో అనేక అవాస్తవాలు వచ్చాయని, వాటిని నేను ఖండిస్తున్నానన్నారు. మా మామగారి ఇంట్లో సోదాలు అవాస్తవమని, తనకు సౌత్ ఆఫ్రికాలో ఎలాంటి మైనింగ్ లేదన్నారు. రఘుమారెడ్డి ఫిర్యాదుతో ఐటి అధికారులు సోదాలు చేయలేదన్నారు.