Bigg Boss7 | బిగ్ బాస్ సీజన్ 7 అంత ఉల్టా పుల్టా.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. అయితే ఈ సారి హౌజ్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా, వారు బిగ్ బాస్‌ని ఇంప్రెస్ చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎపిసోడ్లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ముందుగా రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్‌ని రతిక నిలదీయడం, శుభ శ్రీ విషయంలో గౌతం కృష్ణ అసూయ […]
Bigg Boss7 |
బిగ్ బాస్ సీజన్ 7 అంత ఉల్టా పుల్టా.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. అయితే ఈ సారి హౌజ్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా, వారు బిగ్ బాస్‌ని ఇంప్రెస్ చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎపిసోడ్లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
ముందుగా రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్‌ని రతిక నిలదీయడం, శుభ శ్రీ విషయంలో గౌతం కృష్ణ అసూయ పడటం, షకీలా భయపెట్టించడం, చివరికి పవర్ అస్త్ర కోసం ఫైటింగ్ చేయడం వంటివి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి.
పవర్ అస్త్ర సాధించేందుకు ఇప్పటికే సందీప్, ప్రియాంకలు పోటీలో ఉండగా, శుక్రవారం బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్స టాస్క్‌లో శివాజీ , రతిక గెలుపొంది పవర్ అస్త్ర పొందేందుకు, హౌజ్‌లో కన్ఫమ్ అయ్యేందుకు పోటీ పడే కంటెండర్‌గా నిలిచారు.
ఇక హౌజ్‌లో అప్పుడే పులిహోర బ్యాచ్‌లు మొదలయ్యాయి. ప్రశాంత్, రతిక చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుండగా, తాజా ఎపిసోడ్లో తనపై ఉన్న ఫీలింగ్ ఏంటో చెప్పాలని నిలదీసింది రతిక. అందరి సమక్షంలో తనపై నీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో చెప్పాలని నిలదీయడంతో సందర్భం వచ్చినప్పుడు చెబుతా అని ప్రశాంత్ అన్నాడు. దీనికి రతిక..ఇదంతా డ్రామా అని చెప్పుకొచ్చింది.
ఇక శుభశ్రీ విషయంలో గౌతం కృష్ణ జెలసీ ఫీలవుతున్నట్టుగా కనిపిస్తుంది. లైవ్ స్ట్రీమింగ్‌లో గౌతమ్ మెడపై పంటిగాట్లు ఉన్నట్టు చూపించారు.. అయితే అది ఎవరు పెట్టారో.. ఎవరు కొరికారో.. ఎ అసలు ఇతను ఎందుకు కొరికించుకున్నాడో.. తెలియదు కానీ.. గౌతమ్ మెడకి అటు మూడు ఇటు మూడు పంటి గాట్లను గమనించింది రతిక.
అయితే ఆట సందీప్ అదిచూసి అవి లిప్ స్టిక్ మచ్చల్లా లేవంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే గౌతమ్ మాట్లాడుతూ.. నేను పడుకుని లేచేసరికి ఉన్నాయ్ మాస్టారూ.. నన్ను ఇన్వాల్ చేయకండి’ అని తప్పించుకునే ప్రయత్నం చేడు. ఇక షకీలా తన నట విశ్వరూపం చూపించి అందరిని ఇంప్రెస్ చేసింది.
ఆమె భయ పడుతున్నట్టు, కలవర పడుతున్నట్టు యాక్ట్ చేసి హౌజ్‌లో ఉన్నవారందరికి వణుకు పుట్టించింది. తెల్లారి లేచాక ఇదంతా శివాజీ, షకీలా కలిసి ఆడిన డ్రామా అని తెలుసుకున్న దామిని సారీ చెప్పాలంటూ డిమాండ్ చేసింది.
ఇక పవర్ అస్త్ర కోసం పోటీ పడే నలుగురిలో ఇద్దరిని ఎలిమినేట్ చేయాలంటూ కంటెస్టెంట్స్‌కి తెలియ జేశారు బిగ్ బాస్. దీంతో రతిక, శివాజీ లను ఎక్కువ మంది నామినేట్ చేశారు. ఎంతో నమ్మిన శుభశ్రీ తనని నామినేట్ చేయడం పట్ల రతిక హర్ట్ అయి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే పవర్ అస్త్ర కోసం నేడు సందీప్, ప్రియాంక పోటీ పడనుండగా, ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.