అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి : విద్యా శాఖ
విధాత, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ విద్యా శాఖా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించింది. కాగా.. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసేందుకు, వారి హాజరు శాతాన్ని తెలుసుకునేందుకు బయోమెట్రిక్ హాజరు ఉపయోగపడుతుందన్నారు. ఇక టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయా విద్యా సంస్థల్లో […]

విధాత, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ విద్యా శాఖా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించింది.
కాగా.. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసేందుకు, వారి హాజరు శాతాన్ని తెలుసుకునేందుకు బయోమెట్రిక్ హాజరు ఉపయోగపడుతుందన్నారు. ఇక టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయా విద్యా సంస్థల్లో ఎంత సమయం పని చేస్తున్నారు. వారి సెలవులు, ఇతరత్రా విషయాలకు కూడా బయో మెట్రిక్ హాజరు ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.