బీజేపీ ఫోకస్ ఆ స్థానాలపైనే!
విధాత:ఈ మధ్య పేపర్లలో ఒక వార్త వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇప్పటి దాకా గెలవని 140 లోక్ సభ స్థానాలపై ఫోకస్ పెట్టిందని ఆ వార్త సారాంశం. దీనికి బలం చేకూర్చే విధంగా పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చేర్చుకున్నది ఆ రాష్ట్రంలోని పాటియాల స్థానం నుంచి ఆయనను పోటీ చేయించే యోచనలో ఉన్నదట. దక్షిణ గోవాలో సీటు సాధించడానికి దిగంబర్ కామత్‌ను చేర్చుకున్నది. ఇలా ఇప్పటి నుంచే ఆ 140 స్థానాల్లో కమలం […]

విధాత:ఈ మధ్య పేపర్లలో ఒక వార్త వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇప్పటి దాకా గెలవని 140 లోక్ సభ స్థానాలపై ఫోకస్ పెట్టిందని ఆ వార్త సారాంశం. దీనికి బలం చేకూర్చే విధంగా పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చేర్చుకున్నది ఆ రాష్ట్రంలోని పాటియాల స్థానం నుంచి ఆయనను పోటీ చేయించే యోచనలో ఉన్నదట.
దక్షిణ గోవాలో సీటు సాధించడానికి దిగంబర్ కామత్‌ను చేర్చుకున్నది. ఇలా ఇప్పటి నుంచే ఆ 140 స్థానాల్లో కమలం పార్టీ వికసించేలా కార్యాచరణ మొదలు పెట్టింది. ఎందుకు బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నదనే ప్రశ్న ఎదురవుతుంది.
అయితే 2014,2019 ఎన్నికల్లో వలె భారీ సీట్లు వచ్చే అవకాశం లేదు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లలో సగం కోల్పోయినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నడూ నెగ్గని స్థానాలపై దృష్టి సారించింది.
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటీవల చేరిన సీనియర్ నేతలు మొదలు మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలను లోక్ సభకు పోటీ చేయించాలని కమలదళ అధిష్టానం భావిస్తున్నది. అంటే లోక్‌సభకు పోటీ చేసే వారికి వ్యక్తిగతంగా పేరుతో పాటు ఆర్థికంగా బలంగా ఉండే వారి పై ఫోకస్ చేస్తున్నది.
అలాంటి వారు అయితే ఆ పార్లమెంటు పరిధిలో ఓట్లతో పాటు కొంత ఖర్చు కూడా ఆ నేతలే పెట్టుకునేలా ఒప్పిస్తారని టాక్ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్నది. అందుకే ఈ మధ్య ఆ పార్టీలో చేరికలు కొంత తగ్గాయి అనే వాదనలు కూడా ఉన్నాయి.