BJP ఇన్నాళ్లకు బయట పడింది.. జనసేనతో పొత్తు లేనట్లేనా! కడుపులో ఉన్నదంతా కక్కేసిన మాధవ్

విధాత‌: మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు పలు అంశాలను బహిర్గత పరుస్తున్నాయ్. విద్యావంతుల్లో అధికార వైసీపీకి బలం లేదన్న అంశం వెల్లడైంది.. ఇది కాకుండా BJP.. జనసేన మధ్యనున్న బంధాన్ని కూడా ఆ ఎన్నిక తేటతెల్లం చేసింది. అసలు తమతో జనసేనకు పొత్తు ఉందా లేదా అనే విషయం తమకు క్లారిటీ లేదని BJP నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాధవ్ ఆవేదన చెందారు. తమకు ఈ ఎన్నికల్లో జనసేన నుంచి మద్దతు దక్కలేదని, తమకు జనసేన ప్రచారం […]

BJP ఇన్నాళ్లకు బయట పడింది.. జనసేనతో పొత్తు లేనట్లేనా! కడుపులో ఉన్నదంతా కక్కేసిన మాధవ్

విధాత‌: మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు పలు అంశాలను బహిర్గత పరుస్తున్నాయ్. విద్యావంతుల్లో అధికార వైసీపీకి బలం లేదన్న అంశం వెల్లడైంది.. ఇది కాకుండా BJP.. జనసేన మధ్యనున్న బంధాన్ని కూడా ఆ ఎన్నిక తేటతెల్లం చేసింది.

అసలు తమతో జనసేనకు పొత్తు ఉందా లేదా అనే విషయం తమకు క్లారిటీ లేదని BJP నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాధవ్ ఆవేదన చెందారు. తమకు ఈ ఎన్నికల్లో జనసేన నుంచి మద్దతు దక్కలేదని, తమకు జనసేన ప్రచారం చేయలేదని ఆయన ఆరోపించారు.

వాస్తవానికి ఏపీలో మూడున్నరేళ్ల క్రితం బీజేపీ (BJP) జనసేనల మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తు 2024 ఎన్నికల కోసం అని ఇరుపార్టీలు ప్రకటించాయి. అయితే BJPతో బాటు టీడీపీతో(TDP) పొత్తు ఉండాలని పవన్ భవిస్తూ వస్తున్నారు. వట్టినే బీజేపీతో పొత్తు అవసరం లేదని పవన్ ఆలోచన.

అయితే ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ పవన్( Pawan Kalyan) BJPకి అనుకూలంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో విశాఖ నుంచి బరిలో దిగిన మాధవ్ ఓడిపోయారు. దీని ద్వారా మాధవ్ కడుపులో ఉన్నదంతా కక్కేసారు. జనసేనతో పొత్తు ఉందో లేదో తెలియదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు.

జనసేన(JANASENA) తమకు ఏ మాత్రం సహకరించలేదు అనేశారు. మిత్రపక్షంగా తమకు మద్దతు ఇవ్వాల్సిన జనసేన కనీసం ప్రకటన కూడా చేయకపోవడం పట్ల బీజేపి(BJP) అవమానంతో బాటు ఆవేదన చెందుతోంది.

కలసి నడవకపోతే జనాలు పొత్తు ఎలా అనుకుంటారని మాధవ్ ప్రశ్నించడం ద్వారా తమ మధ్య స్నేహం, పొత్తులు ఏవీ లేవని తేల్చేశారు. మరోవైపు పవన్ కూడా టీడీపీతో సాగాలని నిర్ణయించుకున్న తరుణంలో బీజేపీని వదిలేస్తారా.. లేదా అన్నది చూడాలి.