BJP Mahila Morcha | దమ్ముంటే ముద్దులు పెట్టు.. చిరుమర్తికి బీజేపీ మహిళా నాయకుల సవాల్
ఎమ్మెల్యే చిరుమర్తి నివాసం ఎదుట బీజేపీ మహిళా మోర్చా నిరసన విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని, బీజేపీ నాయకులను ఉద్దేశించి మీ పెళ్లాలకు తెలంగాణ తమ్ముళ్లు, బీఆర్ఎస్ నాయకులు ముద్దులు పెడతారు.. మీరు ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి ఇంటి ముట్టడి నిర్వహించిన బీజేపీ, మహిళా మోర్చా (BJP Mahila Morcha) నాయకులు నిరసనకు దిగారు. చిరుమర్తికి వ్యతిరేకంగా […]

- ఎమ్మెల్యే చిరుమర్తి నివాసం ఎదుట బీజేపీ మహిళా మోర్చా నిరసన
విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని, బీజేపీ నాయకులను ఉద్దేశించి మీ పెళ్లాలకు తెలంగాణ తమ్ముళ్లు, బీఆర్ఎస్ నాయకులు ముద్దులు పెడతారు.. మీరు ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి.
గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి ఇంటి ముట్టడి నిర్వహించిన బీజేపీ, మహిళా మోర్చా (BJP Mahila Morcha) నాయకులు నిరసనకు దిగారు. చిరుమర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చిరుమర్తిని ఇంటి నుంచి బయటకు రావాలని, బీజేపీ మహిళలం వచ్చామని, దమ్ముంటే వచ్చి ముద్దులు పెట్టాలని సవాలు విసిరారు. కామాంధుడు చిరుమర్తి లింగయ్య వెంటనే బీజేపీ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చిరుమర్తి ఇంటి ముట్టడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు ముందుకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ నాయకులకు తోపులాట, ఘర్షణ సాగింది. బీజేపీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్ లలో ఎక్కించి వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.