BJP Nalgonda | పేపర్ల లీకేజీపై BJP నిరసన హోరు! మా నౌకరీలు మాగ్గావాలంటు దీక్షలు!

పేపర్ల లీకేజీపై దీక్షలు! విధాత: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ శ్రేణులు నిరసన దీక్షలు నిర్వహించాయి. నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో సోమవారం మా నౌకరీలు మాగ్గావాలి నినాదంతో బీజేపీ నిరసన దీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులు అందరికీ లక్ష […]

  • By: Somu    latest    Mar 20, 2023 10:08 AM IST
BJP Nalgonda | పేపర్ల లీకేజీపై BJP నిరసన హోరు!  మా నౌకరీలు మాగ్గావాలంటు దీక్షలు!
  • పేపర్ల లీకేజీపై దీక్షలు!

విధాత: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ శ్రేణులు నిరసన దీక్షలు నిర్వహించాయి. నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో సోమవారం మా నౌకరీలు మాగ్గావాలి నినాదంతో బీజేపీ నిరసన దీక్షలు నిర్వహించింది.

ఈ సందర్భంగా పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులు అందరికీ లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను భర్తరఫ్ చేయాలని, మా నౌకరీలు మాగ్గావాలనే నినాదాలతో నిరసన దీక్షల శిబిరాలు హోరెత్తాయి.

నల్గొండ గడియారం సెంటర్లో నిర్వహించిన బీజేపీ నిరసన దీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, మునిసిపల్ ప్లోర్ లీడర్ బండారు ప్రసాద్, బీజేపీ రాష్ట్ర నాయకులు కన్మంత రెడ్డీ శ్రీదేవి రెడ్డీ, నాగం వర్షిత్ రెడ్డీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల రాజశేఖర్ రెడ్డి.

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసోజు యాదగిరి చారి, బీజేపీ దళిత మోర్చ రాష్ట్ర కార్యదర్శి పోతే పాక సాంబయ్య , బీజేపీ జిల్లా కార్యదర్శి పోతేపాక లింగ స్వామి, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రెగట్టే రుఖ్న గౌడ్, తిప్పర్తి మండల అధ్యక్షులు గుండా వినయ్, బీజేపీ నాయకులు బొజ్జ నాగరాజు, కంకణాల నాగి రెడ్డి, దాసరి సాయి, అయితరాజు సిద్దు, బీజేపీ అధికార ప్రతినిధి బోగరి అనిల్ కుమార్, కనగల్ మండల అధ్యక్షులు పులకరం భిక్షం, బీజేపీ మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రావెల్ల కాశమ్మ, పట్టణ మహిళ మోర్చా అధ్యక్షురాలు నేవర్సు నీరజ, మునగాల సుధారాణి, హైమావతి, నారగొని భార్గవి, టంగుటూరి శ్యామ్, మండల వినోద్, తదితరులు పాల్గొన్నారు.