BJP | బండి సంజయ్ నేను కలిసి వచ్చి సమావేశం పెడుతాం: కిషన్ రెడ్డి

BJP తెలంగాణలో అధికార సాధనే బీజేపీ ధ్యేయం విధాత: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేయనున్నామని, జాతీయ నాయకత్వం ఇదే ఆలోచనతో పనిచేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతు 1980 నుండి పార్టీలో కొనసాగుతున్న తాను క్రమ శిక్షణ గల కార్యకర్తగా పార్టీ అప్పగించిన ఏ బాధ్యతల నిర్వహణకైనా పని చేస్తానన్నారు. తెలంగాణ బిజేపి […]

BJP | బండి సంజయ్ నేను కలిసి వచ్చి సమావేశం పెడుతాం: కిషన్ రెడ్డి

BJP

తెలంగాణలో అధికార సాధనే బీజేపీ ధ్యేయం

విధాత: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేయనున్నామని, జాతీయ నాయకత్వం ఇదే ఆలోచనతో పనిచేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతు 1980 నుండి పార్టీలో కొనసాగుతున్న తాను క్రమ శిక్షణ గల కార్యకర్తగా పార్టీ అప్పగించిన ఏ బాధ్యతల నిర్వహణకైనా పని చేస్తానన్నారు.

తెలంగాణ బిజేపి నాయకత్వం కలిసికట్టుగా ముందుకు సాగుతుందని, ఈ నెల ఎనిమిదవ తేదిన ప్రధాని మోదీ హజరుకానున్న వరంగల్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తాను బండి సంజయ్ తో కలిసి హైద్రాబాద్‌లో పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించనున్నామన్నారు.

మోదీ సభ విజయవంతం చేయడం కోసం పార్టీ నాయకత్వం అంతా కృషి చేయనుందన్నారు. ప్రధాని వరంగల్ పర్యటనలో రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేస్తారన్నారు. రోజుకు మూడు రైల్వే వ్యాగన్ కు ఇక్కడ తయారవుతాయన్నారు. 150 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్యాక్టరీ ద్వారా 8 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

అలాగే ఆరువేల కోట్ల రూపాయలతో నిర్మించనున్న జాతీయ రహదారుల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆయా శంకుస్థాపనలను వరంగల్ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా చేపడతారని తెలిపారు.