Suryapet | సూర్యాపేట.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన బోయిన్‌పల్లి ఎస్ఐ
Suryapet | విధాత: హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్ (Bowenpally Police)లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ రాణి (SI Jhansi Rani) ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయ్యారు. సూర్యాపేట జనరల్ ఆస్పత్రి (Suryapet General Hospital)లో ఝాన్సీ రాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఝాన్సీ రాణి భర్తది సూర్యాపేట కావడంతో ఆమె అక్కడే ఉంటున్నారు. ఆదివారం పురిటినొప్పులు రావడంతో సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఎస్ఐకి వైద్యులు డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు […]

Suryapet |
విధాత: హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్ (Bowenpally Police)లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ రాణి (SI Jhansi Rani) ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయ్యారు.
సూర్యాపేట జనరల్ ఆస్పత్రి (Suryapet General Hospital)లో ఝాన్సీ రాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఝాన్సీ రాణి భర్తది సూర్యాపేట కావడంతో ఆమె అక్కడే ఉంటున్నారు.
ఆదివారం పురిటినొప్పులు రావడంతో సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఎస్ఐకి వైద్యులు డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.