అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ గడువు తేదీ పెంపు
విధాత: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ పొందుటకు గడువు తేదీని 30-10-2022 వరకు పొడిగించినట్లు, అడ్మిషన్ పొందగోరే వారు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ లేదా సమాన స్థాయి కలిగిన నేషనల్ ఓపెన్ స్కూల్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యార్హత కలిగిన వారు అర్హులు అని కేఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్(లేర్నర్ సపోర్ట్ సెంటర్) కో- ఆర్డినేటర్ ఎన్ కోటయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. 2022-2023 సంవత్సరానికి గానూ ప్రవేశాల భర్తీకి […]

విధాత: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ పొందుటకు గడువు తేదీని 30-10-2022 వరకు పొడిగించినట్లు, అడ్మిషన్ పొందగోరే వారు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ లేదా సమాన స్థాయి కలిగిన నేషనల్ ఓపెన్ స్కూల్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యార్హత కలిగిన వారు అర్హులు అని కేఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్(లేర్నర్ సపోర్ట్ సెంటర్) కో- ఆర్డినేటర్ ఎన్ కోటయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు.
2022-2023 సంవత్సరానికి గానూ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే అక్టోబర్ 15వ తేదీతోనే దరఖాస్తుల గడువు ముగిసినా అభ్యర్థుల కోరిక మేరకు దీనిని ఈ మళ్లీ అక్టోబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ దరఖాస్తు గడవు అనేది జూన్ 30 నుంచి పొడిగించుకుంటూ వస్తున్నారు.
దరఖాస్తు చేసుకున్న చాలా మంది విద్యార్థుల్లో ఫీజు కట్టనివారు ఉన్నారు. దీంతో మరో సారి అడ్మిషన్ గడువును పెంచారు. అక్టోబర్ 30, 2022 వరకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అడ్మిషన్లు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

దరఖాస్తు ప్రక్రియ https://www.braouonline.in/ వెబ్సైట్ కి వెళ్లి ఆన్లైన్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఏ కోర్సు చేయాలనుకుంటున్నారో ఆ కోర్సును ఎంచుకొని దరఖాస్తులను సమర్పించొచ్చు. అంతకు ముందు విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారు.. సెకండియర్ ట్యూషన్ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు కూడా అక్టోబఱ్ 30వ తేదీలోగా ట్యూషన్ ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ)కు 10+2 / ఇంటర్మీడియట్/ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ – తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ – ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొంది. ఇవి కూడా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి. మరిన్ని వివరాలకు వర్సిటీ హెల్ప్‌లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600లకు కాల్ చేయాలని సూచించారు.