ముద్దు ఇచ్చిన వ‌రుడు.. పెళ్లి క్యాన్షిల్ చేసిన వ‌ధువు

Uttar Pradesh | త‌న‌కు కాబోయే భార్య‌తో స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని ప్ర‌తి ఒక్క వ్య‌క్తి కోరుకుంటాడు. ఆ స‌ర‌దా కోసం ఎదురు చూస్తుంటాడు. అయితే నిశ్చితార్థం రోజున వ‌ధువుకు వ‌రుడు ముద్దిచ్చాడు. ఆ ముద్దును ఆమె పాజిటివ్‌గా తీసుకోలేదు. అతిథుల ముందు త‌న‌కు కిస్ ఇస్తావా అంటూ ఏకంగా పెళ్లినే క్యాన్షిల్ చేసింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీలో వెలుగు చూసింది. 23 ఏండ్ల వ‌యసున్న ఓ యువ‌తి డిగ్రీ చ‌దువుకుంది. ఇటీవ‌లే ఆమెకు పెళ్లి నిశ్చ‌య‌మైంది. […]

ముద్దు ఇచ్చిన వ‌రుడు.. పెళ్లి క్యాన్షిల్ చేసిన వ‌ధువు

Uttar Pradesh | త‌న‌కు కాబోయే భార్య‌తో స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని ప్ర‌తి ఒక్క వ్య‌క్తి కోరుకుంటాడు. ఆ స‌ర‌దా కోసం ఎదురు చూస్తుంటాడు. అయితే నిశ్చితార్థం రోజున వ‌ధువుకు వ‌రుడు ముద్దిచ్చాడు. ఆ ముద్దును ఆమె పాజిటివ్‌గా తీసుకోలేదు. అతిథుల ముందు త‌న‌కు కిస్ ఇస్తావా అంటూ ఏకంగా పెళ్లినే క్యాన్షిల్ చేసింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీలో వెలుగు చూసింది.

23 ఏండ్ల వ‌యసున్న ఓ యువ‌తి డిగ్రీ చ‌దువుకుంది. ఇటీవ‌లే ఆమెకు పెళ్లి నిశ్చ‌య‌మైంది. అయితే వారం రోజుల క్రితం ఈ యువ‌తికి నిశ్చితార్థం జ‌రిగింది. నిశ్చితార్థ వేడుక‌లో వారిద్ద‌రూ దండ‌లు మార్చుకున్నారు. అనంత‌రం అతిథు ముందే ఆమెకు ముద్దిచ్చాడు. దీంతో యువ‌తి తీవ్ర అస‌హ‌నానికి గురైంది. అతిథుల ముందే ముద్దిచ్చిన వ్య‌క్తి.. భ‌విష్య‌త్‌లో అత‌ని ప్ర‌వ‌ర్త ఎలా ఉంటుందో అని భావించి, పెళ్లి క్యాన్షిల్ చేసింది పెళ్లి కూతురు.

అయితే త‌న ఫ్రెండ్స్‌తో వేసిన ఛాలెంజ్ మేర‌కే ఆమెకు అంద‌రి ముందు ముద్దు ఇచ్చిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. యువ‌తిని ఎంత స‌ముదాయించిన‌ప్ప‌టికీ ఈ పెళ్లి చేసుకునేందుకు అంగీక‌రించ‌డం లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.