అన్న పరామర్శకు వెళ్లి తమ్ముడు మృతి.. తెల్లారి అన్న మృతి!

లెంకాలపల్లి గ్రామంలో విషాదం అన్నను చూసేందుకు వెళ్లి తమ్ముడు అనారోగ్యంతో అన్న మృతి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అన్నదమ్ములు వేరు వేరు కారణాల చేత ఒక్కరోజు వ్యవధిలోనే మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకలపల్లిలో జరిగింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. లెంకాలపల్లి గ్రామానికి చెందిన యువ రైతులు తుమ్మలపల్లి రవి(40), తుమ్మలపల్లి జలంధర్ ఇద్దరూ అన్నదమ్ములు. కొద్దిరోజుల క్రితం అన్న తుమ్మలపల్లి రవి అనారోగ్యంతో హన్మకొండలోని […]

  • By: krs    latest    Jan 20, 2023 11:00 AM IST
అన్న పరామర్శకు వెళ్లి తమ్ముడు మృతి.. తెల్లారి అన్న మృతి!
  • లెంకాలపల్లి గ్రామంలో విషాదం
  • అన్నను చూసేందుకు వెళ్లి తమ్ముడు
  • అనారోగ్యంతో అన్న మృతి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అన్నదమ్ములు వేరు వేరు కారణాల చేత ఒక్కరోజు వ్యవధిలోనే మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకలపల్లిలో జరిగింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాలిలా ఉన్నాయి. లెంకాలపల్లి గ్రామానికి చెందిన యువ రైతులు తుమ్మలపల్లి రవి(40), తుమ్మలపల్లి జలంధర్ ఇద్దరూ అన్నదమ్ములు. కొద్దిరోజుల క్రితం అన్న తుమ్మలపల్లి రవి అనారోగ్యంతో హన్మకొండలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అన్నను చూసేందుకు హాస్పిటల్ వద్దకు వెళ్లిన జలంధర్ అన్న రవి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడాన్ని చూసి, ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడు మృతి విషయం సీరియస్ కండీషన్‌లో ఉన్న అన్న రవికి తెలియకూడదని గోప్యంగా ఉంచి జలంధర్ అంత్యక్రియలు నిర్వహించారు.

గురువారం రోజున అంత్యక్రియలు ముగిసిన సాయంత్రం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రవి పరిస్థితి విషమించి మృతి చెందారు. తమ్ముడి మరణం అన్నకు తెలియకుండానే మృతి చెందడం అత్యంత బాధాకరం. ఒక్కరోజు గ్యాప్ లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. రవి, జలంధర్ ఇద్దరికీ చెరో ఇద్దరు మగ పిల్లలున్నారు.

మృతుల కుటుంబాలను జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పరామర్శించి. ఆర్థిక సాయం అందించారు. ప‌రామ‌ర్శించిన వారిలో రాష్ట్ర రైతు విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, బాణోత్ సారంగపాణి, కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్, పాలెపు రాజేశ్వరరావు, క్లష్టర్ ఇంచార్జ్ శివాజీ, సర్పంచ్ మేకల లక్ష్మీ సాంబయ్య, ఉప సర్పంచ్ కక్కేర్ల శ్రీనివాస్ త‌దితరులు పాల్గొన్నారు.