కేటీఆర్‌కు నిరసన సెగ..కామారెడ్డి బీఆరెస్ సమావేశంలో రచ్చ

బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ ఎదురైంది

కేటీఆర్‌కు నిరసన సెగ..కామారెడ్డి బీఆరెస్ సమావేశంలో రచ్చ

విధాత, హైదరాబాద్‌ : బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ ఎదురైంది. కామారెడ్డి నియోజకవర్గం బీఆరెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, సీనియర్ నేత కొమ్ముల తిరుమలరెడ్డి పేర్లను ప్రస్తావించకపోవడంతో వారి అనుచరులు నిరసనకు దిగారు. దీంతో తేరుకున్న కేటీఆర్ వారి పేర్లను ప్రస్తావించిన వారు కొద్దిసేపు వాదోపవాదాలకు దిగగా, ఇతర నేతలు జోక్యం చేసుకుని వారిని శాంతింపచేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు సమావేశంలో రసాభాస నెలకొంది.