దండగన్నదే దిక్కయ్యింది.. వైరల్‌గా బీఆరెస్ ట్వీట్
కాంగ్రెస్ ప్రభుత్వం దండగ అని ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ హైదరాబాద్ తాగు నీటి అవసరాలను తీర్చనుందని బీఆరెస్ పార్టీ ట్విటర్ ఎక్స్‌లో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది

విధాత: కాంగ్రెస్ ప్రభుత్వం దండగ అని ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ హైదరాబాద్ తాగు నీటి అవసరాలను తీర్చనుందని బీఆరెస్ పార్టీ ట్విటర్ ఎక్స్‌లో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి కేవలం గత కేసీఆర్ ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఎజెండాతో కాళేశ్వరం కుంగిపోయింది.. కూలిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హంగామా అంతా ఉత్తదే అని స్పష్టమైందని ట్విట్‌లో పేర్కోంది.
ఇప్పుడు హైదరాబాద్ ప్రజల తాగు నీటి అవసరాలను తీర్చడానికి కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరమే దిక్కయిందని, ఇప్పటికైనా బురద చల్లడం బంద్ పెట్టి ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని సూచించింది. తమ వాదనకు నిదర్శనంగా మిషన్ భగీరథ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచించాలని చెప్పిన వ్యాఖ్యలతో కూడిన సీఎంవో ట్విట్ అంశాలను బీఆరెస్ తన ట్విట్‌లో పోస్టు చేసింది.