MLA Rajaiah | ఆడొళ్ళను అడ్డు పెట్టుకొని రండ రాజకీయం చేస్తున్నారు.. బోరున విలపించిన రాజయ్య
ఆడొళ్ళను అడ్డు పెట్టుకొని రండ రాజకీయం చేస్తున్నారు ఎన్నికల ముందు కుట్ర రాజకీయం ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నం విలపించిన 'స్టేషన్'ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల ముందు ఎప్పుడు తనపై కుట్రలు పన్నుతున్నారని, గతంలో కూడా ఇదే చేశారని, ఇప్పుడు కూడా ఆడోళ్లను అడ్డుపెట్టుకుని రండ రాజకీయాలు చేస్తున్నారు అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య (MLA Rajaiah) తీవ్ర ఆవేదనకు గురై విలపించారు. MLA Rajaiah | ఆడొళ్ళను అడ్డు […]

- ఆడొళ్ళను అడ్డు పెట్టుకొని రండ రాజకీయం చేస్తున్నారు
- ఎన్నికల ముందు కుట్ర రాజకీయం
- ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నం
- విలపించిన ‘స్టేషన్’ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల ముందు ఎప్పుడు తనపై కుట్రలు పన్నుతున్నారని, గతంలో కూడా ఇదే చేశారని, ఇప్పుడు కూడా ఆడోళ్లను అడ్డుపెట్టుకుని రండ రాజకీయాలు చేస్తున్నారు అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య (MLA Rajaiah) తీవ్ర ఆవేదనకు గురై విలపించారు.
MLA Rajaiah | ఆడొళ్ళను అడ్డు పెట్టుకొని రండ రాజకీయం చేస్తున్నారు.. బోరున విలపించిన రాజయ్య pic.twitter.com/oU96dxmscd
— vidhaathanews (@vidhaathanews) March 15, 2023
2018 ఎలక్షన్ లో కూడా కొంతమంది నాయకులు తనను ఎదుర్కోలేక ఇలాగే వ్యవహరిస్తూ ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేసినా కూడా ప్రజలు అప్పటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నీరు. ఎవరు ఏం చేసినా ప్రజలకు తాను ఏంటో తెలుసని ఎమ్మెల్యే అన్నారు. ఫాదర్ కొలంబో జయంతిని పురస్కరించు కుని బుధవారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఫాదర్ కొలంబోతో తనకున్న సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తనను దెబ్బకొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. అన్ని సర్వేలలో తానే గెలుస్తానని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. అత్యంత ప్రజాబలం ఉన్న తనపై లేని పోని ఆరోపణలను చేయిస్తున్నారని బాధను వ్యక్తం చేశారు.
అక్క చెల్లెల్లతో ఆప్యాయంగా మాట్లాడలేకపోతున్నా
మహిళలను ముందు పెట్టుకొని చేస్తున్న ఆరోపణలతో తన ఇంట్లో అక్కచెల్లెళ్ల ముందు, మనుమలు మనవరాళ్లతో ఆప్యాయంగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుందని ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఒక దశలో కన్నీటిని ఆపుకోలేక బోరున విలపించారు. ఈ సంఘటనతో కార్యకర్తలు ఆయనను ఓదార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
తనను ఎదుర్కోలేక శిఖండి రాజకీయాలతో తనను ఏం చేయలేరని మండిపడ్డారు. ఇటీవల సర్పంచ్ నవ్య ఆరోపణలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. తనకు యువత, మహిళల బలం ఉందని, ఆ బలాన్ని తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తనకు 63 సంవత్సరాలు, నలుగురు చెల్లెళ్లు, కొడుకులు, కొడళ్లు, మనవలు, మనవరాండ్లు వచ్చారన్నారు. తనపై బాధాకరమైన ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు.
మళ్లీ ఐదోసారి తానే గెలుస్తానని తెలిసి తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ ఎమ్మెల్యే విలపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మళ్లీ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు. ప్రసంగిస్తూనే రాజయ్య కన్నీటి పర్యంతమయ్యారు.