MLC Kavitha | ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్సీ కవిత.. 4 గంటలుగా విచారణ

విధాత‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) నేడు మరోసారి ఈడీ (ED) ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదట ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్దకు కవితతో పాటు ఆమె భర్త అనిల్‌(Anil), మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌(Minister Srinivas Goud), న్యాయవాది సోమ భరత్ (Soma Bharat) చేరుకున్న తర్వాత కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఉదయం 10. 45 గంటలకు లోపటికి వెళ్లగా అప్పటి నుంచి  సాయంత్రం 4.30 నిమాషాల వరకు కూడా విచారణ కొనసాగుతూనే […]

MLC Kavitha | ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్సీ కవిత.. 4 గంటలుగా విచారణ

విధాత‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) నేడు మరోసారి ఈడీ (ED) ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదట ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్దకు కవితతో పాటు ఆమె భర్త అనిల్‌(Anil), మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌(Minister Srinivas Goud), న్యాయవాది సోమ భరత్ (Soma Bharat) చేరుకున్న తర్వాత కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు.

ఉదయం 10. 45 గంటలకు లోపటికి వెళ్లగా అప్పటి నుంచి సాయంత్రం 4.30 నిమాషాల వరకు కూడా విచారణ కొనసాగుతూనే ఉన్నది. మరో రెండు మూడు గంటల పాటు విచారణ జరుగనున్నట్టు సమాచారం.

గత వారం మరోసారి ఈడీ విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే మహిళగా తనకు ఉన్న హక్కులను పరిరక్షించాలని కోరుతూ తాను సుప్రీంకోర్టు (Supreme Court) లో దాఖలు చేసిన పిటిషన్‌ ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించనున్నదని, కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎదురుచూడాలని కవిత ఈ నెల 16న ఈ-మెయిల్‌ లేఖ ద్వారా ఈడీకి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.

కానీ ఈరోజు విచారణకు రావాలని ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. అలాగే ఈడీ సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేసింది. కవిత పిటిషన్‌పై విచారణ సందర్భంలో తమ వాదన కూడా వినాలని అందులో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ విచారణ తర్వాత ఏం జరగనున్నది? అనే ఆసక్తి నెలకొన్నది.

ఉదయం 11.30 జరగాల్సిన విచారణకు కవిత 35 నిమిషాల ముందే హాజరయ్యారు. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 50 కింద ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్‌ ఈ కేసులో ఆమె అనుమానితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్‌లో సౌత్‌గ్రూప్‌ నుంచి కవిత ను ఈడీ కీలక వ్యక్తిగా పేర్కొన్న ఈడీ ఢిల్లీ, హైదరాబాద్‌లో చర్చించిన అంశాలపై ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ సహా ఇతర డాక్యుమెంట్లను కవిత ఈడీ అధికారులకు అందించారు. ఈ కేసులో కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిసి ఆమెను ప్రశ్నిస్తున్నారా? లేదా అనే అంశంపై స్పష్టత రానున్నది.

MLC Kavitha | ఇంకా ఈడీ ఆఫీసులోనే కవిత.. సుదీర్ఘంగా కొనసాగుతున్న విచారణ