కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రూపాయి ఇవ్వని మోడీ పెద్దన్ననా
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించని ప్రధాని మోడీ ఎలా పెద్దన్న అవుతాడో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు

- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్
విధాత, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించని ప్రధాని మోడీ ఎలా పెద్దన్న అవుతాడో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అదిలాబాద్‌లో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ‘పెద్దన్న’ అని సంభోదించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు.
తక్షణమే జీవో నెంబర్ 3ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెం 3కు వ్యతిరేకంగా ఈనెల 8న మహిళ దినోత్సవం రోజున ధర్నా చౌక్ వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 వేల ఉద్యోగాల్లో మహిళలకు ఇచ్చింది కేవలం 70వరకు మాత్రమేనని… 33 శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయిందన్నారు.