ఢిల్లీలో BRS పార్టీ కార్యాలయం.. ఏర్పాటుకు సన్నాహాలు
విధాత: ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. సర్దార్ పటేల్ రోడ్డు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. జోద్‌పూర్ రాజ వంశీయుల బంగ్లా లీజుకు తీసుకుని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ నూతన పార్టీ కార్యాలయాన్ని ఎంపీ సంతోష్‌కుమార్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వసంత్ విహార్‌లో తెలంగాణ భవన్ పనులు వేగవంతం చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఆరు నెలల్లో తెలంగాణ భవన్ పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. […]

విధాత: ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. సర్దార్ పటేల్ రోడ్డు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. జోద్‌పూర్ రాజ వంశీయుల బంగ్లా లీజుకు తీసుకుని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ నూతన పార్టీ కార్యాలయాన్ని ఎంపీ సంతోష్‌కుమార్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా వసంత్ విహార్‌లో తెలంగాణ భవన్ పనులు వేగవంతం చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఆరు నెలల్లో తెలంగాణ భవన్ పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.
2021 సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన సంగతి విదితమే. టీఆర్ఎస్ భవన్ 1,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవన్ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.