64 కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ

ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆరెస్‌ అండగా ఉంటుందని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు

64 కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ
  • కార్యకర్తల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్ పార్టీ

విధాత : ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆరెస్‌ అండగా ఉంటుందని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆరెస్‌ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను ఆయన పంపిణీచేశారు. మొత్తం 64 కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందించారు.


ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ప్రమాదవశాత్తు చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ అధినేత కేసీఆర్‌ ముందుచూపుతో ప్రమాద బీమా అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆరెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌గుప్తా, మాజీ ఎమ్మెల్యే చందర్‌, నాయకులు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.