కాళేశ్వరం కాంట్రాక్ట్ సంస్థ మేఘా నుంచే బీఆరెస్ కు భారీగా విరాళాలు!
బీఆరెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చిన డబ్బును ఈడీ ప్రకటించింది. రూ. 1322 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో వచ్చినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు

- ఆ తరువాత యశోద ఆసుపత్రి
- ఈసీ వివరాల్లో వెల్లడి
విధాత: బీఆరెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చిన విరాళాల్లో అత్యధికం మెఘా ఇంజినీరింగ్ కంపెనీ నుంచే అత్యధికంగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ వెల్లడించిన యునిక్ కోడ్ తో ఈ విషయం వెలుగు చూసింది. రూ.1322 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో బీఆరెస్‌కు వచ్చాయి. అందులో గుర్తు తెలియని కొందరు దాతలు రూ. 28.75 కోట్ల రూపాయలు ఇచ్చారు. అత్యధికంగా మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా స్ట్రక్షర్ ప్రైయివేట్ లిమిటెడ్ సంస్థ రూ.195 కోట్లు ఇచ్చింది.
ఆ తర్వాత యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూ. 94 కోట్లు, చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 50 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్ లిమిటెడ్ రూ. 32 కోట్లు, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ రూ. 30 కోట్లు, ఐఆర్బి ఎంపీ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ రూ. 25 కోట్లు, ఎల్7 హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 22 కోట్లు, కోయా అండ్ కంపెనీ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ రూ. 20 కోట్లు, ఎంఎస్ఎన్ ఫార్మసీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 20 కోట్లు, హానర్ లాబ్స్ లిమిటెడ్ రూ. 20 కోట్లు, హెటిరో ప్రైవేట్ లిమిటెడ్ రూ. 20 కోట్లు, హెస్ లిమిటెడ్ రూ. 20 కోట్లు, దివిస్ ల్యాబ్స్ రూ. 20 కోట్లు, తెల్లాపూర్ టెక్నో సిటీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 కోట్లు, రాజా పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 20 కోట్లు, ఎన్ఎస్ఎల్ సెజ్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 19.5 కోట్లు, కే రహేజా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 18 కోట్లు, కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ రూ. 16 కోట్లు.
మై హోం ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 15 కోట్లు, ధీరజ్ మెడికల్స్ రూ. 15 కోట్లు, అపర్ణ ఫామ్స్ అండ్ ఎస్టేట్ లిమిటెడ్ రూ. 15 కోట్లు, ఆక్వాస్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 15 కోట్లు, అరబిందో ఫార్మా లిమిటెడ్ రూ. 15 కోట్లు, సంధ్య కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.13 కోట్లు, హజాలో ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 12.5 కోట్లు, హైందిస్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 12.5 కోట్లు, నాట్కో ఫార్మా లిమిటెడ్ రూ. 20 కోట్లు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ రూ. 10 కోట్లు, ఎంకేజే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రూ.10 కోట్లు, సెల్మర్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 10 కోట్లు, శ్రీ చైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 10 కోట్లు, సూపర్ సైబర్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 10 కోట్లు, పీపీఆర్ఎం సాండ్ రూ. 10కోట్లు, కైటెక్ చిల్డ్రన్స్ లిమిటెడ్ రూ. 9 కోట్లు, స్క్వేర్ రియాల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 8 కోట్లు, కామా క్రెడిట్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7 కోట్లు, ఈవీఈవై ట్రాన్స్పోర్ట్ రూ. 6 కోట్లు, గాజా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.5 కోట్లు, యాక్సిస్ కెమికల్ లిమిటెడ్ రూ.5 కోట్లు బాండ్ల రూపంలో అందించాయి.