BRS vs BJP: దిల్ రాజు వర్సెస్ నితిన్!

BRS vs BJP: Dil Raju vs Nithin! విధాత‌: సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే తెలంగాణ, ఏపీలలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ సంగతి పక్కన పెడితే.. ఈసారి తెలంగాణలో కూడా రాజకీయం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుండటమే. ఇటీవల అమిత్ షా, నడ్డాలు టాలీవుడ్ హీరోలను కలిసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, నితిన్ వంటి […]

BRS vs BJP: దిల్ రాజు వర్సెస్ నితిన్!

BRS vs BJP: Dil Raju vs Nithin!

విధాత‌: సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే తెలంగాణ, ఏపీలలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ సంగతి పక్కన పెడితే.. ఈసారి తెలంగాణలో కూడా రాజకీయం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుండటమే. ఇటీవల అమిత్ షా, నడ్డాలు టాలీవుడ్ హీరోలను కలిసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, నితిన్ వంటి వారిపై బిజెపి ఓ కన్నేసి ఉంచితే.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భార‌త రాష్ట్ర సమితిగా మారి జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన కేసీఆర్ పార్టీ వైపు కూడా పలువురు సినీ సెలబ్రిటీలు కన్నేసి ఉంచారనేది ఇప్పుడు సినీ, రాజకీయ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున హేమాహేమీలను పోటీలో దించాలని ఆలోచిస్తున్నారు. ఇంతవరకు తెలంగాణలో విజయశాంతి, బాబు మోహన్ మాత్రమే ఎన్నికల్లో నిలబడిన సినీ ప్రముఖులుగా చెప్పుకోవాలి. కానీ ఈసారి మాత్రం ఈ లిస్ట్ ఎక్కువగా కనిపించే అవకాశమే ఉంది. ఎందుకంటే.. సినీ నిర్మాతలు దిల్ రాజు, రామ్ తాళ్లూరి, దర్శకుడు శంకర్, నితిన్, జీవిత, కత్తి కార్తీక.. ఇలా చాలా మంది ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారనేలా టాక్ వినబడుతోంది.

ఇక ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అధికార బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లుగా.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం చూస్తుంటే తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా నర్సింగపల్లికి చెందిన ఆయన ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా గానీ దిగాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. దిల్ రాజుకు టికెట్ ఇప్పించే బాధ్యత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకున్నారని అంటున్నారు. దిల్ రాజు దిగితే.. ఆయనకు పోటీగా బిజెపి తరఫు నుంచి నితిన్‌ను దింపే అవకాశం ఉన్నట్లుగా బిజెపి వర్గాలు ఆలోచన చేస్తున్నట్లుగా అప్పుడే టాక్ బయటకి రావడం విశేషం. ఇదే కనుక జరిగితే.. BJP vs BRS పోటీ కాస్త.. నితిన్ వర్సెస్ దిల్ రాజు అనేలా మారడం ఖాయం. చూద్దాం.. ముందు ముందు సినీ రాజకీయ పరిణామాలు ఏ దారి తీస్తాయో.