KTR | రైతుల కంటే రాజకీయమే కాంగ్రెస్‌కు ముఖ్యమా

రాష్ట్ర ప్రజల, రైతుల ప్రయోజనాలకంటే మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాజకీయమే ముఖ్యమని తేలిపోయిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు

KTR | రైతుల కంటే రాజకీయమే కాంగ్రెస్‌కు ముఖ్యమా

ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

విధాత : రాష్ట్ర ప్రజల, రైతుల ప్రయోజనాలకంటే మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాజకీయమే ముఖ్యమని తేలిపోయిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమ్మత్తులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కేసీఆర్‌ డిమాండ్ చేస్తున్న క్రమంలో డిపార్ట్‌మెంట్ ఇంజినీర్లు చెయ్యాలి అని రిపోర్ట్ ఇచ్చిన తరువాత, కడతాం అని కూడా ఎల్‌ఆండ్‌టీ కంపనీ ముందుకు వచ్చిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కేసీఆర్‌ని బద్నాం చెయ్యాలనే ఒకే ఒక అజెండాతో కాఫర్ డాం కట్టకుండా రైతులని నిండా ముంచాలని చూస్తుందన్నారు. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పరోక్షంగా నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఖరిని తప్పుబట్టారు.

మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మరమ్మతులు జరిపించాలని ఇంజనీర్లు సూచించడం..ఇందుకు ఎల్‌ఆండ్‌టీ ముందుకు రావడం జరిగింది. అయితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఎన్‌డీఎస్‌ఏ అయ్యర్ కమిటీ రిపోర్టు వచ్చాకే మరమ్మతుల విషయం ముందుకెళ్లాలని అప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోరాదంటూ ఉత్తమ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ వైఖరిని తప్పుబడుతు కేటీఆర్ ట్విటర్ వేదికగా అసంతృప్తి వెళ్లగక్కారు.