31నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు నిర్వహించనున్నారు.

- అదే రోజు రాష్ట్రపతి ప్రసంగం
- ఫిబ్రవరి 1న బడ్జెట్
విధాత : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు నిర్వహించనున్నారు. 31వ తేదీన రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్‌కు తగినంత సమయం లేకపోవడంతో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
బడ్జెట్‌ను పూర్తి సమర్పించడానికి తగినంత సమయం లేనప్పుడు లేదా అదే సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నప్పుడు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి తన ఆరవ వరుస బడ్జెట్‌ను సమర్పించనున్నారు. పూర్తి బడ్జెట్ మే 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టబడుతుంది.
మధ్యంతర బడ్జెట్ అనేది సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు లేదా కొత్త ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు ప్రభుత్వం సమర్పించే తాత్కాలిక ఆర్ధిక ప్రణాళికగా పేర్కోంటారు. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయ బడ్జెట్‌ను రూపొందించి సమర్పించే వరకు ప్రభుత్వ వ్యయ అవసరాలను తీర్చిడానికి తాత్కాలిక ఏర్పాటుగా మధ్యంతర బడ్జెట్ ఉపయోగపడుతుంది. మధ్యంతర బడ్జెట్‌లో ఎన్నికల కమిషన్ ప్రవర్తన నియమావళి మేరకు నూతన విధాన ప్రకటనలు.. పథకాలు ఉండవు.
కేవలం ప్రస్తుత ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వం ఏర్పడే కాలానికి మధ్య ఉండే సమయంలో ప్రభుత్వ ఖర్చులకు ఉద్దేశించింది మాత్రమే. ఇందుకు మధ్యంతర బడ్జెట్‌కు పస్తుత ప్రభుత్వానికి పార్లమెంటు అనుమతి అవసరం. అందుకే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతారు. మధ్యంతర బడ్జెట్ ద్వారా ఎన్నికలకు ముందు జీతాలు వంటి ముఖ్యమైన ఖర్చుల కోసం పార్లమెంటు ఓటాన్ అకౌంట్‌ను ఆమోదిస్తారు. ఎలాంటి చర్చ లేకుండా ఓటాన్ అకౌంటును ఆమోదించాకా రెండు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. పరిస్థితుల మేరకు పొడిగించుకునే అవకాశముంది.