ఏనుగుకు భయపడి.. రివర్స్‌లో 8కి.మీ వెనక్కి వెళ్లిన బస్సు (వీడియో)
Kerala | విధాత: అది దట్టమైన అడవి.. ఆ అడవిలో ఉన్న ఓ మార్గం గుండా ప్రయాణికులతో బస్సు వేగంగా కదులుతోంది. కానీ అంతలోనే నడిరోడ్డుపై గజరాజు దర్శనమిచ్చాడు. అది భారీ ఏనుగు కావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయపడిపోయారు. బస్సు వైపే ఏనుగు కదలడంతో.. వెనక్కి తిప్పాలని ప్రయాణికులు డ్రైవర్‌ను కోరారు. చేసేదేమీ లేక ఇరుకైన మూలమలుపుల్లో ఏకంగా 8 కిలోమీటర్ల దూరం రివర్స్ గేర్‌లో వచ్చింది బస్సు. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని చాలకుడి నుంచి […]

Kerala | విధాత: అది దట్టమైన అడవి.. ఆ అడవిలో ఉన్న ఓ మార్గం గుండా ప్రయాణికులతో బస్సు వేగంగా కదులుతోంది. కానీ అంతలోనే నడిరోడ్డుపై గజరాజు దర్శనమిచ్చాడు. అది భారీ ఏనుగు కావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయపడిపోయారు. బస్సు వైపే ఏనుగు కదలడంతో.. వెనక్కి తిప్పాలని ప్రయాణికులు డ్రైవర్‌ను కోరారు. చేసేదేమీ లేక ఇరుకైన మూలమలుపుల్లో ఏకంగా 8 కిలోమీటర్ల దూరం రివర్స్ గేర్‌లో వచ్చింది బస్సు.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని చాలకుడి నుంచి వాల్పరాయ్ మార్గంలోని అటవీ మార్గం గుండా 40 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తుంది. దారి మధ్యలో బస్సుకు ఏనుగు అడ్డురావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. బస్సును వెనక్కి తిప్పాలని డ్రైవర్‌ను ప్రయాణికులందరూ కోరారు.
దీంతో ఇరుకైన, వంకర రోడ్డులోనే అంబాలపర నుంచి అనక్కయాం వరకు రివర్స్ గేర్‌లో 8 కిలోమీటర్ల మేర బస్సును తీసుకొచ్చాడు డ్రైవర్. ఇంత దూరం బస్సును ఏనుగు వెంటాడింది. చివరకు ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో.. బస్సు మళ్లీ ముందుకు కదిలింది. దీంతో ప్రయాణికులు, డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నారు. గత రెండేండ్ల నుంచి ఈ ఏరియాలో ఏనుగు సంచరిస్తోందని, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని తెలిసింది.