యాదాద్రి: వ‌లిగొండ‌లో కెరియ‌ర్ గైడ్ లైన్స్ సెల్ ప్రారంభం

ప్ర‌ణాళికలతో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్ పమేలా సత్పతి విధాత: విద్యార్థులు ప్రణాళికాయుతంగా చదువుకొని కెరియర్లో తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంపిటీషన్ ఎగ్జామినేషన్, కేరియర్ గైడ్ లైన్స్ సెల్ ను కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో నాణ్యమైన విద్యను అందించ‌డంతో పాటు విద్యార్థుల […]

  • By: krs    latest    Dec 06, 2022 9:16 AM IST
యాదాద్రి: వ‌లిగొండ‌లో కెరియ‌ర్ గైడ్ లైన్స్ సెల్ ప్రారంభం
  • ప్ర‌ణాళికలతో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్ పమేలా సత్పతి

విధాత: విద్యార్థులు ప్రణాళికాయుతంగా చదువుకొని కెరియర్లో తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంపిటీషన్ ఎగ్జామినేషన్, కేరియర్ గైడ్ లైన్స్ సెల్ ను కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో నాణ్యమైన విద్యను అందించ‌డంతో పాటు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి రంగంలో పోటీ పెరిగిపోయిందని దీనినీ దృష్టిలో పెట్టుకొని కళాశాలలో ప్రారంభించిన కెరియర్ గైడ్ లైన్స్ సెల్‌ను కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకొ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి చిలుక రమణి, కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ కుమార్, ఎన్ సీ సీ ప్రోగ్రాం అధికారి విక్రమ్ బాబు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.