Purnesh Modi | సూరత్‌లో రాహుల్‌పై కేసు.. అతను పూర్ణేశ్ భూట్వాలా! పూర్ణేశ్ మోదీ కాదు
పూర్ణేశ్ సామాజిక వర్గం పేరు మోదీ ఆయన ఇంటి పేరు మాత్రం భూట్వాలా విధాత: మోదీ ఇంటి పేరు గురించి వ్యాఖ్యలు చేసిన రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడానికి కారణమైన నేత.. పూర్ణేశ్ మోదీ (Purnesh Modi)! ఈయన పశ్చిమ సూరత్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మోదీ ఇంటిపేరు ఉన్నవాళ్లు రాహుల్ చేసిన వ్యాఖ్యలతో మనస్తాపానికి గురయ్యారని, అలాంటి వారిలో తానూ ఉన్నానని పూర్ణేశ్ కేసు వేశారు. నిజానికి […]

- పూర్ణేశ్ సామాజిక వర్గం పేరు మోదీ
- ఆయన ఇంటి పేరు మాత్రం భూట్వాలా
విధాత: మోదీ ఇంటి పేరు గురించి వ్యాఖ్యలు చేసిన రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడానికి కారణమైన నేత.. పూర్ణేశ్ మోదీ (Purnesh Modi)! ఈయన పశ్చిమ సూరత్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
మోదీ ఇంటిపేరు ఉన్నవాళ్లు రాహుల్ చేసిన వ్యాఖ్యలతో మనస్తాపానికి గురయ్యారని, అలాంటి వారిలో తానూ ఉన్నానని పూర్ణేశ్ కేసు వేశారు. నిజానికి ఆయన తన ఇంటి పేరును 1988లో మార్చుకున్నారు. ఆయన పాఠశాల టీసీలో ఇంటిపేరు ‘భూట్వాలా’ అని, ‘మోదీ ఘంచి’ అనేది సామాజిక వర్గం పేరని ఉన్నది.
తమ పూర్వీకులు సూరత్‌లోని భూట్ సేరీ అనే ప్రాంతంలో నివసించినందున తమ కుటుంబానికి భూట్వాలా అనే పేరు వచ్చిందని పూర్ణేశ్ మోదీ చెప్పారు. రాహుల్‌పై పరువు నష్టం కేసులో డిఫెన్స్ లాయర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో ఆయన తన అసలు ఇంటిపేరు భూట్వాలా అని, తర్వాత మోదీ అని మార్చుకున్నానని వెల్లడించారు.
ఆయన తన ఇంటిపేరును 1988లో మార్చుకున్నట్టు తెలుస్తున్నది. మోదీ సామాజిక వర్గం వారు సంచారవాసులు. నూనె ఉత్పత్తుల రంగంలో పనిచేస్తూ గుజరాత్‌లో స్థిరపడ్డారు. 1994లో ఈ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారు.