మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు నమోదు

బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం వరుస కేసుల్లో ఇరుక్కుంటుంది. బీఆరెస్‌ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై భూ కబ్జా కేసు

మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు నమోదు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం వరుస కేసుల్లో ఇరుక్కుంటుంది. బీఆరెస్‌ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై భూ కబ్జా కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో భూమి కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిది చింతా మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు. మేరకు సంతోష్ పాటు పాటు లింగారెడ్డి, శ్రీధర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నంబర్ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసింది.

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈనెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 400, 471, 447, 120బి రెడివిత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేయగా ఆమె కస్టడీలో ఉన్నారు. కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. ఓఎస్సార్ ప్రాజెక్టు నిర్మాణాలు చేస్తుండగా కన్నారావు రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో 2ఎకరాల భూమిని కబ్జాకు పాల్పడినట్లుగా విచారణలో తేలడంతో కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదు చేశారు. ఒకవైపు వలసలు…మరోవైపు కుటుంబ సభ్యులపై కేసులతో బీఆరెస్ అధినేత కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి కావాల్సివచ్చింది.